వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియన్ టెక్కీల సత్తాకు నీల్సన్ డీల్ కారణం: నాస్కామ్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత ఐటీ పరిశ్రమ సత్తాపై అంతర్జాతీయంగా విశ్వాసం కొనసాగుతోందని నాస్కామ్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. నీల్సన్‌తో టీసీఎస్‌ ఒప్పందం భారత ఐటీ పరిశ్రమ పట్ల క్లెయింట్ల విశ్వాసం చెక్కుచెదరలేదని ఈ విషయం మరోసారి నిరూపించిందని చెప్పారు.

తమ సాంకేతిక పనుల కోసం భారత ఐటీ పరిశ్రమపై ఆధారపడిన అంతర్జాతీయ సంస్థలు తమ డిజిటల్‌ కార్యకలాపాలనూ భారత్‌కే ఆఫర్‌ చేయడం కొనసాగిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.సంప్రదాయ టెక్నాలజీలపై వెచ్చించే భారత ఐటీ పరిశ్రమ క్లెయింట్‌లు క్రమంగా డిజిటల్‌ కార్యకలాపాలను భారత కంపెనీలకు మళ్లిస్తారని అభిప్రాయపడ్డారు.

TCS-Nielsen deal is a thumbs up for Indian IT, says Nasscom

క్లౌడ్‌ కంప్యూటింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌ వంటి నూతన టెక్నాలజీలపై సేవలు అందించేందుకు భారత ఐటీ సేవల పరిశ్రమ సంసిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టెక్‌ మహీంద్ర వంటి కంపెనీలు గత ఏడాది తమ ఆదాయాల్లో 17 నుంచి 22 శాతం డిజిటల్‌ టెక్నాలజీ సేవల ద్వారానే ఆర్జించాయి.

English summary
A large deal win by Tata Consultancy Services from market research firm Nielsen, which constituted nearly 50% digital technology work, reaffirms the confidence of clients in Indian IT industry, said R Chandrasekhar, president of Nasscom.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X