వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలకు గడ్డు పరిస్థితి: హెచ్1బి వీసాలను తగ్గించేసిన టీసీఎస్..

గతేడాదితో పోలిస్తే కేవలం మూడో వంతు హెచ్1బి వీసాల కోసం మాత్రమే టీసీఎస్ దరఖాస్తు చేసుకుంది. విదేశీ టెక్కీలకు బదులు అమెరికన్ యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ క్యాంపస్ లు, బీస్కూళ్ల నుంచి నియామకాలను చేపట్టనుంది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమెరికాలో ట్రంప్ అధికారంలోకి రావడం విదేశీ వలసలకు ఎంతటి గడ్డు పరిస్థితులు కల్పించిందో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఉద్యోగ రీత్యా అమెరికాకు వెళ్లాలని కలలు కనే వాళ్లకు భంగపాటు తప్పడం లేదు. ఇప్పటికే హెచ్1బి వీసా నిబంధనలను కఠినతరం చేయడం.. ప్రీమియం వీసాలను రద్దు చేయడం వంటి పరిణామాలతో చాలావరకు విదేశీ వలసలు తగ్గిపోయాయి.

దానికి తోడు భారీ వేతనాలు కలిగినవాళ్లనే అమెరికాలో రిక్రూట్ చేసుకునేలా ట్రంప్ విధించిన నిబంధనలు విదేశీ టెక్కీలకు మరింత గడ్డు పరిస్థితి నెలకొనేలా చేశాయి. ఈ నేపథ్యంలో భారత్ లోని కంపెనీలు కూడా అమెరికా నిబంధనల మేరకు నడుచుకుంటున్నాయి. ఇప్పటికే ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు అమెరికాలో స్థానికులకే పెద్ద పీట వేసేలా చర్యలు తీసుకున్నాయి.

 tcs says applications for h1b visas have dropped sharply

తాజాగా మరో టెక్ దిగ్గజం టీసీఎస్ కూడా ఇదే బాటలో పయనిస్తోంది. గతేడాదితో పోలిస్తే కేవలం మూడో వంతు హెచ్1బి వీసాల కోసం మాత్రమే టీసీఎస్ దరఖాస్తు చేసుకుంది. విదేశీ టెక్కీలకు బదులు అమెరికన్ యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ క్యాంపస్ లు, బీస్కూళ్ల నుంచి నియామకాలను చేపట్టనుంది.

గత రెండేళ్లుగా అమెరికాలో స్థానిక నియామకాలను పెంచుతూ వస్తున్నట్లు టీసీఎస్ ఈవీపీ హ్యుమన్ రిసోర్స్ అజోయ్ ముఖర్జీ అన్నారు. స్థానిక నియామకాల ద్వారా వీసాలపై ఆధారపడాల్సిన అవసరముండదని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే 2015తో పోలిస్తే 2016లొ మూడో వంతు వీసాల కోసం మాత్రమే టీసీఎస్ దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. అమెరికాతో పాటు సింగపూర్, ఆస్ట్రేలియాలలో కూడా అక్కడి నిబంధనలకు తగినట్లుగానే వ్యవహరించబోతున్నట్లు వెల్లడించాయి.

English summary
Tata Consultancy Services (TCS) applied for only a third of the H-1B work visas this year compared to 2015, helped by increased hiring from engineering campuses and B-schools in the US.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X