వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్ల‌మెంట్ సాక్షిగా మోడీని నిల‌దీసిని టీడిపి...!!

|
Google Oneindia TeluguNews

పార్లిమెంట్ లో అవిశ్వాస తీర్మానం ప‌ట్ల టీడిపి ఎంపి గ‌ల్లా జ‌య‌దేవ్ ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌ను లేవ‌నెత్తారు. విభ‌జ‌న స‌మ‌యంలో పార్ల‌మెంట్ లో చోటు చేసుకున్న సంద‌ర్బాలు, కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిపాదపాద‌న‌లు, బీజేపి పెట్టిన డిమండ్లను వివ‌రించారు. ఆ త‌ర్వాత భార‌తీయ జ‌న‌తా పార్టీ అదిక‌రంలోకి వ‌చ్చాక విభ‌జ‌న హామీల‌ను ఎందుకు నెర‌వేర్చ‌లేదు అనే అంశాల‌ను జ‌య‌దేవ్ ప్ర‌స్తావిచారు. విభ‌జ‌న హామీల అమ‌లులో ప్ర‌ధాని మోదీని విల‌న్ గా అభివ‌ర్ణించారు గ‌ల్లా. అంతే కాకుడా విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ ప్ర‌జాక్షేత్రంలో ఎలా అబాసుపాలైందో రాబోవు ఎన్నిక‌ల్లో బీజెపి కి కూడా అదే గ‌తి ప‌డుతుంద‌ని ఘాటుగా విమ‌ర్శించారు. భరత్ అనే నేను సినిమాను ప్రస్తావించిన గల్లా జయదేవ్ - ఒక వ్యక్తి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలన్నదే కథాంశంమ‌ని ప‌రోక్షంగా బీజెపి ప్ర‌భుత్వానికి చుర‌క‌లంటించారు.

సత్తా చాటుకున్న టీడిపి.. మోదీ స‌మ‌క్షంలోనే ద్వ‌జ‌మెత్తిన గ‌ల్లా..!!

సత్తా చాటుకున్న టీడిపి.. మోదీ స‌మ‌క్షంలోనే ద్వ‌జ‌మెత్తిన గ‌ల్లా..!!

పార్ల‌మెంట్ లో అవిశ్వాస తీర్మానం పై చ‌ర్చ సంద‌ర్బంగా వాడి వేడి చ‌ర్చ‌కు తెర‌తీసారు టీడిపి ఎంపి గ‌ల్లా జ‌య‌దేవ్. విభ‌జ‌న హామీల అమ‌లులో కేంద్ర ప్ర‌భుత్వం చూపిస్తున్నఅల‌సత్వాన్ని ప్ర‌శ్నిస్తూనే ప్ర‌ధాని మోదీ ని చీట‌ర్ గా అభివ‌ర్ణించే ప్ర‌య‌త్నం చేసారు. విభ‌జ‌న స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిపాదించిన హామీల‌ను కాద‌ని అద‌నంగా మ‌రికొన్ని హామీలు పొందుప‌ర‌చాల‌ని ప‌ట్టుప‌ట్టిన బీజెపి అదికారం లోకి వ‌చ్చిన త‌ర్వాత మాట మార్చింద‌ని మండిప‌డ్డారు. బీజెపి ప్ర‌భుత్వం నాలుగు బ‌డ్జెట్ల‌లో కూడా లోటు బ‌డ్జెట్ లో ఉన్న ఏపికి స‌రైన న్యాయం చేయ‌లేద‌ని ప్ర‌స్తావించారు.

విభ‌జ‌న హామీల అమ‌లులో బీజెపి నిర్ల‌క్ష్యం వ‌హించింద‌న్న టీడిపి..

విభ‌జ‌న హామీల అమ‌లులో బీజెపి నిర్ల‌క్ష్యం వ‌హించింద‌న్న టీడిపి..

విభ‌జ‌న త‌ర్వాత విభ‌జ‌న హామీల‌కోసం తెలుగుదేశం చేస్తున్న పోరాటాన్ని పూర్తి స్థాయిలో స‌మ‌ర్థించుకున్నారు టీడిపి ఎంపిలు. కాంగ్రెస్ తల్లిని చంపి బిడ్డను బతికించిందని మోదీ అన్న మాట‌లు ఇంకా తెలుగు ప్ర‌జ‌లు మ‌ర్చిపోలేద‌ని గుర్తు చేసారు. ఆనాడు రాజ్యసభలో ఎంపీగా అన్న నాయకులు ఐదేళ్లు కాదు పదేళ్లు అని చెప్పిన విషయం తో పాటు తిరుపతి, నెల్లూరులో మోదీ ఇచ్చిన భరోసా గుర్తుందా అని నిల‌దీసారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసానికి, వెన్నుపోటుకు గురయ్యారని, ఏపి ప్ర‌జ‌ల ఆవేదనను, అర్థం చేసుకోవాల‌ని తెలిపారు. ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పిందనడం మిథ్యగా అభివ‌ర్ణించిన గ‌ల్లా., ఆర్థిక సంఘం సభ్యుడు టి.గోవిందరావుగారు అలాంటి సిఫార్సు చేయలేదని చెప్పారు.

తెలుగు ప్ర‌జ‌ల మ‌నోభావాల‌తో ఆడుకుంటే ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రిక..

తెలుగు ప్ర‌జ‌ల మ‌నోభావాల‌తో ఆడుకుంటే ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రిక..

బీజెపి ప్ర‌భుత్వానికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాం., ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండని గ‌ల్లా వేడుకున్నారు. హోదా కోసం ఏపిలో నిర‌శ‌న జ్వాల‌లు ఎగిసి ప‌డుతున్నా ఆర్థికమంత్రి కరుణించలేదని మండిప‌డ్డారు. గ‌తం బీజేపీ అధ్యక్షుడు అమీత్ షా మాట్లాడుతూ ప్ర‌స్తుత‌ ప‌రిణామాలు బీజేపీ, టీడీపీకి మధ్య యుద్ధమని పేర్కొన్నార‌ని కాని ఇప్పుడు జరుగుతున్నది యుద్ధం కాదని, ఆధిపత్యానికి, నైతికతకు మధ్య జరుగుతున్న పోరాటమని, ఇది ధర్మపోరాటం.. ధర్మయుద్ధమ‌ని గ‌ల్లా తెలిపారు. అంతే కాకుండా ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడమన్నది మోదీ ప్రభుత్వం వివక్ష గా గ‌ల్లా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును రాజకీయ క్రీడలో భాగం చేశారని, రాష్ట్ర ప్రయోజనాలకన్నా రాజకీయ ప్రయోజనాలకే బీజెపి ప్ర‌భుత్వం అదిక ప్రాధాన్యం ఇచ్చారని మోదీ పై విమ‌ర్శ‌ల‌ను ఎక్కు పెట్టారు గ‌ల్ల జ‌య‌దేవ్.

అప్ర‌జాస్వామిక విభ‌జ‌న అన్న జ‌య‌దేవ్ వాఖ్య‌ల ప‌ట్ల అభ్యంత‌రం తెలిపిని టీఆర్ఎస్ ఎంపీలు..

అప్ర‌జాస్వామిక విభ‌జ‌న అన్న జ‌య‌దేవ్ వాఖ్య‌ల ప‌ట్ల అభ్యంత‌రం తెలిపిని టీఆర్ఎస్ ఎంపీలు..

గ‌ల్లా జ‌య‌దేవ్ ప్ర‌సంగిస్తూ పార్ల‌మెంట్ లో రాష్ట్రాన్ని అప్ర‌జాస్వామికంగా, అశాస్త్రీయంగా విభ‌జించారు అన్న‌ప్పుడు టీఆర్ఎస్ ఎంపీలు అభ్యంత‌రం వ్య‌క్తం చేసారు. బాల్క సుమ‌న్, జితేంద‌ర్ రెడ్డిలు గ‌ల్లా జ‌య‌దేవ్ ప్ర‌సంగాన్ని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసారు. త‌ర్వాత జితేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, బీజెపి పార్టీల‌ను ఒప్పించిన త‌ర్వాతే తెలంగాణ బిల్లు ఆమోదం పొందిద‌ని చెప్పారు. గ‌ల్లా ప్ర‌స్తావించిన అప్ర‌జాస్వామికం, ఆశాస్త్రీయం అనే ప‌దాల‌ను రికార్డుల నుండి తొల‌గించాల‌ని జితేంద‌ర్ రెడ్డి స్పీక‌ర్ ను కోరారు.

English summary
tdp mp galla jayadev started his speech in parliament targeting prime minister modi. modi hurted telugu people feelings by not by not implementing the promises which promised in the bifurcation act. in the no trust motion speech galla attacked prime minister modi directly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X