ప్రేమ కన్నా టీ బెటర్.. భగ్న ప్రేమికుడి సజెషన్... వావ్ అంటోన్న నెటిజన్స్..
లవ్ సక్సెస్ అయితే ఆ అనుభూతే వేరు. విఫలమైతే ఆ బాధ ఊహించలేనిది. ప్రేమలో గెలిచినవాళ్లు ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా ఉంటారు. ప్రేమలో ఓడిలే.. జీవితం మొత్తం కోల్పోయినట్టు కనిపిస్తారు. డెహ్రడూన్‌కు చెందిన ఓ యువకుడు మాత్రం ప్రేమలో ఓడానని ఏ మాత్రం నిరాశ, నిస్పృహలకు లోనుకాలేదు. మిగతావారికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ప్రేమలో విఫలమైనవాళ్లలో మార్పు రావాలని కోరుకుంటూ.. టీ పాయింట్ ప్రారంభించాడు.

బ్రేకప్..
డెహ్రడూన్‌కు చెందిన దివ్యాన్షు బాత్రా లాక్డౌన్ సమయంలో తన ప్రేయసితో విడిపోయాడు. కొంతకాలం ఆ బాధను భరించి.. ఆరు నెలల తర్వాత తన తమ్ముడు రాహుల్ బాత్రాతో కలిసి ‘దిల్ టుటా ఆషిక్ చాయ్ వాలా' అనే టీ పాయింట్‌ను ఏర్పాటుచేశాడు. దీనికోసం వారిద్దరూ పొదుపు చేసుకున్న డబ్బును ఉపయోగించారు. టీ పాయింట్లో టీతోపాటు, మోమోస్ మరియు ఫ్రైస్ వంటి స్నాక్స్ కూడా అందుబాటులో ఉంచారు.

నా మాట వినండి..
ఈ టీపాయింట్ బోర్డు మీద నా మాట వినండి.. ప్రేమ కంటే టీ చాలా బెటర్, విఫలమైన ప్రేమకు టీ ఒక పరిష్కారం అని దివ్యాన్షు రాయించాడు. ఇలాంటి కొటేషన్స్‌తో ఏర్పాటు చేసిన టీపాయింట్ ఆ ఏరియాలో చాలా ఫేమస్ అయ్యింది. అంతేకాదు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంకేముంది అందరూ.. నో లవ్.. ఓన్లీ టీ అంటున్నారు. ప్రేమలో ఏముందిలే అని చెబుతున్నారు.

లవ్ ఫెయిల్యూర్
చాలా మంది దివ్యాన్హులా అనుకుంటే లవ్ ఫెయిల్యూర్ అయినవారు సూసైడ్ లాంటి ప్రయత్నం చేయరు. చాలా మంది విగతజీవులుగా మారే వారు కాదు. లవ్ పోతే పోయింది.. మిగిలిన జీవితం ఉంది అని అనుకునేవారు. కానీ దివ్యాన్హు చేసింది చాలా మంచి పని అంటున్నారు. అతను చాలా మంది ఆదర్శంగా నిలిచారని కొనియాడుతున్నారు. తాను కూడా దానినే తలచుకొని ఉంటే.. ఇప్పుడు మిగతావారికి ఆదర్శంగా నిలిచేవారు కాదని అంటున్నారు.