వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lockdown: కురుక్షేత్రంలో టీ షాపు యజమానికి సినిమా, రూ. 50 కోట్లు లోన్ ఇచ్చాం, కట్టాల్సిందే, దేవుడా !

|
Google Oneindia TeluguNews

చంఢిగడ్ (హర్యానా): కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు లాక్ డౌన్ అమలు చెయ్యడంతో దేశంలోని కొన్ని కోట్ల మంది చిన్నాచితక వ్యాపారులు రోడ్ల మీదపడ్డారు. కురుక్షేత్రంలో టీ వ్యాపారం దెబ్బ తినడంతో ఏదైనా మంచి వ్యాపారం చెయ్యాలని బ్యాంకులో లోన్ తీసుకోవడానికి వెళ్లిన షాపు యజమానికి బ్యాంకు అధికారులు షాక్ ఇచ్చారు. నీకు లోన్ ఇవ్వడానికి అవకాశం లేదని బ్యాంకు అధికారులు చెప్పారు. సార్, ఏం జరిగింది ? లోన్ ఎందుకు ఇవ్వనంటున్నారు ? అని టీ షాపు యజమాని ఆరా తియ్యగా ఇప్పటికే నువ్వు రూ. 50 కోట్లు అప్పు తీసుకున్నావని, ఆ రుణం తీరిగి చెల్లించిన తరువాత కావాలంటే లోన్ ఇస్తామని బ్యాంకు అధికారులు చెప్పడంతో అతని దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది.

Innocent Wife: భార్యపై అనుమానం, 17 ఏళ్లు కబోడ్ లో దాక్కొని భర్త ఏం చేశాడంటే ? ప్రపంచంలో !Innocent Wife: భార్యపై అనుమానం, 17 ఏళ్లు కబోడ్ లో దాక్కొని భర్త ఏం చేశాడంటే ? ప్రపంచంలో !

 టీ వ్యాపారం కుదేలు

టీ వ్యాపారం కుదేలు

హర్యానాలోని కురుక్షేత్రంలో రాజ్ కుమార్ అనే వ్యక్తీ టీ స్టాల్ నిర్వహిస్తున్నాడు. మార్చి నెల వరకు రాజ్ కుమార్ టీ వ్యాపారం చేసి ఇంతో అంతో డబ్బులు సంపాధిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు మార్చి 25వ తేదీ నుంచి లాక్ డౌన్ అమలు కావడంతో రాజ్ కుమార్ టీ షాపు మూతపడింది.

 దిక్కూదిమానం లేదు

దిక్కూదిమానం లేదు

లాక్ డౌన్ సడలింపులు తరువాత టీ షాపు మళ్లీ ప్రారంభించిన రాజ్ కుమార్ షాక్ కు గురైనాడు. కరోనా వైరస్ దెబ్బకు టీ తాగడానికి వచ్చే వాళ్లే కరువైనారు. వ్యాపారం సక్రమంగా సాగకపోవడంతో దిక్కూదిమానం లేక రాజ్ కుమార్ అయోమయానికి గురైనారు. టీ షాపు అంతంత మాత్రం జరగడం, కుటుంబాన్ని పోషించడం కష్టం కావడంతో వేరే ఏదైనా మంచి వ్యాపారం చెయ్యాలని రాజ్ కుమార్ నిర్ణయించాడు.

 సార్, లోన్ కావాలి

సార్, లోన్ కావాలి

వ్యాపారం చెయ్యడానికి బ్యాంకులో లోన్ (రుణం) తీసుకోవాలని నిర్ణయించిన రాజ్ కుమార్ నేరుగా బ్యాంకు దగ్గరకు వెళ్లాడు. బ్యాంకులో లోన్ ఇచ్చే అధికారులను రాజ్ కుమార్ సంప్రధించి సార్ మీరు ఏదైనా సహాయం చెయ్యాలని మనవి చేశాడు. రాజ్ కుమార్ ఇంటి అడ్రస్, అతని టీ షాప్ అడ్రస్, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు వివరాలు తెలుసుకున్న బ్యాంకు అధికారులు చావుకబురు చల్లాగా చెప్పారు. నీకు లోన్ ఇవ్వడానికి కుదరదని బ్యాంకు అధికారులు చెప్పడంతో రాజ్ కుమార్ ఎందుకని ఆరా తీసి షాక్ కు గురైనారు.

Recommended Video

Air India To Send Employees On Leave Without Pay For Up To 5 years || Oneindia Telugu
 రూ. 50 కోట్లు లోన్ ఇచ్చారా ?

రూ. 50 కోట్లు లోన్ ఇచ్చారా ?

మీకు ఇప్పటికే రూ. 50 కోట్లు లోన్ ఇచ్చామని బ్యాంకు అధికారులు చెప్పడంతో అక్కడే టేబుల్ మీద ఉన్న గ్లాస్ నీళ్లు గుటగుటా అంటూ తాగేసిన రాజ్ కుమార్ అయోమయానికి గురైనాడు. సార్ నా పేరు రాజ్ కుమార్, నేను టీ షాప్ యజమాని, నాకు మీరెప్పుడు రూ. 50 కోట్లు లోన్ ఇచ్చారు ? ఆలోన్ ఎప్పుడు, ఎందుకు ఇచ్చారు ? అంటూ రాజ్ కుమార్ ఆరా తీశాడు. అవన్ని మాకు తెలీవు, నువ్వు రూ. 50 కోట్లు లోన్ తీసుకున్నట్లు బ్యాంకులోని రికార్డులు చెబుతున్నాయని అధికారులు చెప్పడంతో రాజ్ కుమార్ తల గిర్రున తిరిగిపోయింది.

రాజ్ కుమార్ కు మహాభారతం కష్టాలు

బ్యాంకు నుంచి బయటకు వచ్చేసిన రాజ్ కుమార్ అయోమయానికి గురైనాడు. బ్యాంకులో లోన్ తీసుకున్నట్లు ఉన్న పత్రాలజు జిరాక్స్ పేపర్లు తీసుకుని వెళ్లిన రాజ్ కుమార్ టీ స్టాల్ లో టీ తాగడానికి వచ్చే వాళ్లందరికి ఆ కాగితాలు చూపించి లబోదిబో అంటున్నాడు. ఒక వేళ తనపేరుతో ఎవరైనా రూ. 50 కోట్లు రుణం తీసుకున్నారామో ? వాళ్లు ఆ డబ్బు తిరిగి బ్యాంకుకు చెళ్లించకుంటే నాకు ఏమైనా నోటీసులు వస్తాయేమో ? నోటీసులు వస్తే ఏం చెయ్యాలి ? అంటూ రాజ్ కుమార్ ప్రస్తుతం లాయర్ల చుట్టూ తిరుగుతున్నాడు. మొత్తం మీద కురుక్షేత్రంలోని టీ స్టాల్ యజమాని రాజ్ కుమార్ కు బ్యాంకు అధికారులు 70 MM సినిమా చూపించారు.

English summary
Haryana Kurukshetra based Rajkumar who run tea stall upset after bank rejected his loan application. Bank said that he already have debt of Rs 50 crore. But Rajkumar don't know how it is possible.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X