వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిక్షగత్తెగా మారిన టీచర్: సోషల్‌మీడియాలో పోస్ట్‌, ముందుకు వచ్చిన విద్యార్థులు

By Narsimha
|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: చదువు చెప్పిన టీచర్ బిక్షగత్తెగా మారిందని తెలిసిన విద్యార్థులు ఆమెను ఆదుకొనేందుకు ముందుకు వచ్చారు. సోషల్ మీడియాలో తమకు విద్యాబుద్దులు నేర్పిన టీచర్ దీనావస్థను తెలుసుకొని బాధపడ్డారు.ఆమెను తమ వెంట తీసుకెళ్ళేందుకు ఆసక్తి చూపారు. కానీ, ఆ టీచర్ మాత్రం వారితో వెళ్ళేందుకు మాత్రం ఆసక్తి చూపలేదు. కేరళకు చెందిన ఓ టీచర్ గురించి తెలిస్తే కన్నీళ్ళు ఆగవు.

మారుతున్న పరిస్థితుల్లో మానవత్వం లేకుండా మనుషులు వ్యవహరిస్తున్నారనే అపవాదు కూడ లేకపోలేదు.అయితే కేరళలో చోటుచేసుకొన్న ఘటన మానవత్వం మనుషుల్లో ఇంకా మిగిలి ఉందని నిరూపిస్తోంది.

రైల్వేస్టేషన్ వద్ద బిచ్చగత్తెగా అడుక్కొంటున్న ఓ టీచర్‌ ఘటన కేరళలో వైరల్‌గా మారింది.ఆ టీచర్‌ను ఆదుకొంటామని విద్యార్థులు ముందుకు వచ్చారు. ఆ టీచర్ ప్రస్తుతం వృద్దాశ్రమంలో ఆశ్రయం పొందుతోంది.

బిక్షగత్తెగా మారిన టీచర్

బిక్షగత్తెగా మారిన టీచర్

33 ఏళ్లు ఉపాధ్యాయు రాలిగా పనిచేసిన వల్సల కుటుంబ పరిస్థితుల కారణంగా బిక్షగత్తెగా మారింది. అయితే కేరళళోని తిరువనంతపురం రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ఆమెను చూసిన విద్య అనే మహిళ ఫేస్‌బుక్‌లో ఆమె ఫోటో తీసి పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

టీచర్ వృత్తిలో వల్సల

టీచర్ వృత్తిలో వల్సల

వల్సల టీచర్ వృత్తిలో సుమారు 33 ఏళ్ళ పాటు కొనసాగింది.మళప్పురంలోని ఇస్లామిక్‌ పబ్లిక్‌ స్కూల్లో ఏడేళ్ల క్రితం టీచర్‌గా పనిచేశారని విద్యకు సోషల్ మీడియాలో సమాచారం అందింది.దీంతో విద్య వల్సలను తిరువనంతపురంలో వృద్దాశ్రమంలో చేర్పించారు.

టీచర్ కోసం ముందుకొచ్చిన విద్యార్థులు

టీచర్ కోసం ముందుకొచ్చిన విద్యార్థులు

తమకు విద్యాబుద్దులు నేర్పిన టీచర్ వల్సల గురించిన సమాచారం తెలియగానే విద్యార్థులు తీవ్రంగా ఆవేదన చెందారు. ఆమెను తాము ఆదుకొంటామని ముందుకు వచ్చారు.ఇతర దేశాల్లో నివాసం ఉంటున్న విద్యార్థులు తమ టీచర్ వల్సల గురించి వాకబు చేశారు. తమతో తీసుకెళ్ళేందుకు రెడీగా ఉన్నామంటూ సమాచారాన్ని ఇచ్చారు. అయితే వృద్దావ్యంలో ఉన్న తాను ఎవరి వద్దకు వెళ్ళేందుకు అంగీకరించలేదు.

వల్సల ఎందుకిలా మారింది

వల్సల ఎందుకిలా మారింది

మళప్పురంతో పాటు హైదరాబాద్‌లోని సైనిక్‌ స్కూల్లో కూడా వల్సల కొన్నాళ్లు పనిచేసిందని చెబుతారు. భర్త సోమశర్మదాస్‌ ఓ వ్యాపారి. ఈ దంపతులకు సూర్య అనే కొడుకు ఉన్నాడు.ఎనిమిదో తరగతితో ఆపేశాడు. ప్రస్తుతం ఓ ఆటోడ్రైవర్‌. బాగా బతికిన కుటుంబమే ఆమెది. కానీ, భర్త చనిపోయాక ఆమె పరిస్థితి తలకిందులైంది. ఆస్తిని లాక్కొన్న బంధువులు ఆమెకు నిలువ నీడ లేకుండా చేశారని అంటారు.ఆమెకు మతిస్థిమితం లేదన్న నెపంతో, కాపాడాల్సిన కొడుకు కూడా తరిమేశాడు. ప్రస్తుతం డీజిల్‌ దొంగతనం కేసులో రైల్వే పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు.

కొడుకు కోసమే

కొడుకు కోసమే

వల్సల మాత్రం తన కొడుకు వద్దకు వెళ్తానని చెబుతోంది. తనను అభిమానించి తనను అక్కున చేర్చుకొన్న వారికి వల్సల ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం వృద్దాశ్రమంలో వల్సల ఆశ్రయం పొందుతోంది

English summary
When Vidya M.R, a government employee in Kerala’s capital, Thiruvananthapuram, walked to the central railway station in the city to meet a friend of her on November 5, little did she know that it was going to be a special.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X