వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరు రోజులు.. 168 చెంపదెబ్బలు... టీచర్‌కు 14 రోజుల రిమాండ్

|
Google Oneindia TeluguNews

ఒకటికాదు , రెండు కాదు 6 వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఏకంగా లెక్కబెట్టి 168 చెప్పదెబ్బలు కొట్టించాడు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అది కూడ కొత్త తరం ఉపాధ్యాయుడు. అయితే విద్యార్థిని పేరంట్ శివప్రసాద్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు సదరు ఉపాధ్యాయున్ని కోర్టులో ప్రోడ్యుస్ చేయడంతో 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ పంపింది.

విద్యాబుద్దులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే విచక్షణ కోల్పోయాడు...

విద్యాబుద్దులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే విచక్షణ కోల్పోయాడు...

విద్యార్థులు అంటే విద్యను అర్జించేవాళ్లు వాళ్లకు ఏ స్ట్రైల్లో చెబితే అర్ధం చేసుకుంటారో తెలుసుకుని వారికి అర్థమయ్యోలా చెప్పాల్సిన భాద్యత ఉపాధ్యాయులదే. అయితే అలాంటీ ఉపాధ్యాయుడే విచక్షణ కోల్పోయి, వారిపై దాడులకు పాల్పడే సంధర్భాలు కోకొల్లలుగా బయటకు వస్తున్నాయి..ఆధునిక సమాజంలో విద్యార్థులతో ఎలా ఉండాలో ఊదరగొట్టి చెబుతున్నా కొంతమంది ఉపాధ్యాయుల్లో మాత్రం మార్పు రావడం లేదు. సో తాజాగా ఇలాంటీ సంఘటనే మరోటి బయటకు వచ్చింది.

హోం వర్క్ చేయని విద్యార్థికి ఆరు రోజుల పాటు చెంపదెబ్బలు

హోం వర్క్ చేయని విద్యార్థికి ఆరు రోజుల పాటు చెంపదెబ్బలు

మధ్యప్రదేశ్ రాష్ట్ర్రం ఝాబువా జిల్లాకు చెందిన థండ్లా మండలంలో జవహార్ నవదోయ విద్యాలయంలో ఓ విద్యార్థిని ఆరవ తరగతి చదువుతోంది. అయితే ఆ విద్యార్థి గత సంవత్సరం జనవరిలో ఆనారోగ్యం రిత్యా పది రోజుల పాటు స్కూలుకు వెళ్లలేదు. అనంతరం స్కూలుకు వచ్చిన విద్యార్థికి ఉపాధ్యాయుడైన మనోజో వర్మ (37 ) అనుచితమైన పనిష్మెంట్ ఇచ్చాడు. పదిరోజుల పాటు హోంవర్క్ చేయలేదంటూ తోటి విద్యార్థులతో చెంపదెబ్బలు కొట్టించాడు. ఇలా క్లాస్‌లో ఉన్నవారితో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 168 చెంపదెబ్బలు కొట్టించాడు.అయితే మొత్తం క్లాస్‌లో ఉన్న 14 మంది తోటీ విద్యార్థులతో ప్రతి రోజు ఒక్కోక్కరితో రెండు చెంపదెబ్బలను ,ఆరు రోజుల పాటు విద్యార్థిని చెంపదెబ్బలు కొట్టాలని విద్యార్ధులకు చెప్పాడు మనోజ్ వర్మ..

ఉద్యోగం ఊస్ట్..14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్

ఉద్యోగం ఊస్ట్..14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్

అయితే ఈ విషయం విద్యార్థిని తండ్రి అయిన శివప్రసాద్‌కు తెలియడంతో ఆయన ఉపాధ్యాయుడు పై ఫిర్యాధు చేశాడు. అయితే కేసును నమోదు చేసిన పోలీసులు సదరు ఉపాధ్యాయుడిని సంవత్సరం తర్వాత అరెస్ట్ చేసి కోర్టులో ప్రోడ్యూస్ చేశారు.దీనిపై విచారించిన ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఉపాధ్యాయుడికి 14 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. అయితే అంతకు ముందే ఆ ఉపాధ్యాయుడిపై విద్యార్థిని తండ్రి శివప్రసాద్ జవహార్ నవోదయ స్కూల్ కమిటికి కూడ ఫిర్యాదు చేశారు. దీంతో ఉపాధ్యాయుడిపై విచారణన జరిపిన కమిటి ఆయన్ను విధుల నుండి సస్పెండ్ చేసింది...

ఇకా ఇలాంటీ కేసుకు సంబంధించి పిల్లలను కొట్టిన జంటకు దనువా కోర్టు సంవత్సరం జైలు శిక్ష 50వేల రుపాయాల జరిమాన సైతం విధించింది.

English summary
A government school teacher in Madhya Pradesh's Jhabua district has been arrested and remanded in 14-day judicial custody by a court for allegedly directing some students to slap their classmate 168 times for not completing her homework.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X