వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీతిమాలిన టీచర్: బాలికపై లైంగిక వేధింపులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Teacher held for molesting 12-year-old
హౌరా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హౌరా జిల్లా దోమ్జూర్‌లోని ఓ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో బాధుతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడైన ఉపాధ్యాయుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

బాధిత బాలిక శనివారం సాయంత్రం చురమణిపురాలో నివాసం ఉంటున్న ఉపాధ్యాయుడు ఆరూప్ దత్తా(62) వద్దకు ప్రైవేటు ట్యూషన్ నిమిత్తం వెళ్లింది. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆ బాలికపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

ఇంటికి చేరుకున్న బాలిక తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు గమనించిన తన తల్లి ఆమెను ప్రశ్నించగా జరిగిన విషయం బాధిత బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. వేధింపుల విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని తనను బెదిరింపులకు గురి చేసినట్లు బాధిత బాలిక తల్లిదండ్రులకు తెలిపింది.

దీంతో ఈ విషయంపై బాధిత బాలిక తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడు అరూప్ దత్తాను అరెస్ట్ చేసినట్లు దోమ్జూర్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. కాగా నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని బాధితురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

English summary
A 62-year-old teacher was arrested on Sunday for allegedly molesting a Class VI student in Domjur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X