వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐదేళ్ల కూతురి ముందే.. శాలువా కప్పుకున్న వ్యక్తి.. టీచర్‌పై ఘాతుకం...

|
Google Oneindia TeluguNews

ఎప్పుడు, ఎక్కడ, ఎటువైపు నుంచి ఎవరు దాడి చేస్తారో తెలియని పరిస్థితి. అవును కొందరు తుపాకీ చేతపట్టుకొని రెచ్చిపోతున్నారు. అదనుచూసి మరీ పిట్టలను కాల్చినట్టు కాల్చేస్తున్నారు. పంజాబ్‌లోని మొహలిలో ఓ దుండగుడు రెచ్చిపోయాడు. విద్యాబుద్దులు చెప్పే టీచర్‌పై కాల్పుల మోత మోగించాడు. తన తల్లి తన ముందే రక్తపుమడుగులో పడిపోవడంతో చిన్నారి భయాందోళనకు గురైంది.

 టీచర్‌పై కాల్పులు..

టీచర్‌పై కాల్పులు..

మొహలిలోని ఖారార్ టౌన్ వద్ద గల నాలెడ్జ్ బస్ గ్లోబల్ స్కూల్‌లో సరబ్‌జిత్ కౌర్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు ఐదేళ్ల కూతురు ఉన్నారు. పాప కూడా అదే స్కూల్‌లో చదువుకుంటుంది. పాఠశాలకు 2 కిలోమీటర్ల దూరంలో గల ఎస్బీపీ సొసైటీలో చిన్నారితో కలిసి టీచర్ ఉంటున్నారు. భర్తకు విడాకులు ఇచ్చి ఒంటరిగా నివసిస్తున్నారు.

భర్తకి దూరంగా..

భర్తకి దూరంగా..

స్కూల్‌లో సరబ్‌జిత్ ఫ్రెంచీ, పంజాబీ భాషలను బోధిస్తారు. తన భర్తక ఫ్రాన్స్‌లో మరొకరితో వివాహం చేసుకున్నారని టీచర్‌కి తెలిసింది. వారికి కూతురు కూడా ఉన్నారని తెలియడంతో విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటోంది. ఎప్పటిలాగే గురువారం కూడా పాఠశాలకు కూతురితోపాటు వచ్చింది.

ఉదయమే

ఉదయమే

సమయం 7.45 నిమిషాలు.. తన కూతురిని దింపి స్కూటీ స్టాండ్‌ను టీచర్ వేయబోతున్నారు. ఇంతలో అక్కడే తిరుగుతున్న ఆగంతకుడు తాను కప్పుకున్న శాలువా తీశాడు. తుపాకీతో టీచర్‌పై కాల్పులు జరిపాడు. మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో ఆమె అక్కడే కుప్పకూలిపోయారు. తన తల్లిపై కాల్పులు జరుపడం చూసి చిన్నారి పారిపోయారు.

రెక్కీ నిర్వహించి..

రెక్కీ నిర్వహించి..

ఆగంతకుడు ఒకరు ఉదయం నుంచే తచ్చాడుతున్నాడని ప్రత్యక్షసాక్షి ఇంద్రజిత్ సింగ్ పేర్కొన్నారు. తమ టీచర్ చనిపోవడంతో శుక్రవారం పాఠశాలకు సెలవు ప్రకటించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. రంగంలోకి దిగి విచారిస్తున్నారు. హత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే టీచర్ పాఠశాలలో చేరారు. అంతలోనే దారుణం జరగడంతో సిబ్బంది ఎవరి పని అని అనుమానిస్తున్నారు.

English summary
A 35-year-old teacher was shot dead in front of her five-year-old daughter outside her school in Mohali on Thursday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X