వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్యూటీ ఫస్ట్: పెళ్లి రోజూ పాఠాలు చెప్పిన టీచర్‌!

|
Google Oneindia TeluguNews

పాట్నా: ఆ ఉపాధ్యాయురాలు తన వృత్తిపట్ల అమితమైన నిబద్ధతను కలిగివున్నారు. అందుకే, తన పెళ్లి కొద్ది గంటల్లో ఉందనగా కూడా విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు పాఠశాలకు వచ్చారు. విద్యార్థులకు పాఠాలు బోధించిన అనంతరం వివాహ మండపానికి వెళ్లారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ఫాతిమా అనే యువతి పాట్నాకి 100 కి.మీ.ల దూరంలో ఉన్న సరన్‌ జిల్లాలోని ఓ ఉర్దూ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. కాగా, గత శనివారం ఆమెపెళ్లి. వివాహానికి కొద్ది నిమిషాల ముందు ఫాతిమా పాఠశాలకు వెళ్లి పిల్లలకు పాఠాలు చెప్పి తిరిగొచ్చి పెళ్లిపీటలెక్కింది.

 Teacher takes class on day of 'nikah'

అంతేగాక, శనివారం వివాహం జరగగా ఆదివారం మళ్లీ డ్యూటీకి వెళ్లిపోయింది. పెళ్లిళ్లకు రోజుల తరబడి సెలవులు పెట్టడం తనకు నచ్చదని, పిల్లలకు పాఠాలు చెప్పడమే తన ప్రథమ కర్తవ్యమని ఫాతిమా తెలపడం గమనార్హం.

కాగా, ఈ విషయం బయటికి తెలీడంతో జిల్లా మొత్తం ఫాతిమాను ప్రశంసలతో ముంచెత్తింది. ఫాతిమా అందుకున్న ప్రశంసలే ప్రభుత్వం ఇచ్చే గౌరవమని స్థానిక అధికారులు, పెద్దలు కొనియాడారు. పెళ్లంటేనే వారం పదిరోజులపాటు సెలవులు పెట్టే ఈ రోజుల్లో పెళ్లి రోజు కూడా విద్యార్థులకు పాఠాలు బోధించడం మంచి విషయమని వారు పేర్కొంటున్నారు.

English summary
In a rarest of rare instance of practising the adage of 'work is worship' in real life, a Muslim woman teacher of Saran district engaged classes even on the day of her 'nikah' and 'bidai' (send-off) on Saturday and Sunday, respectively.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X