వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిన్నారులే టీచర్లుగా .. సరదా వేడుకకు కరోనా ఎఫెక్ట్ ... తొలిసారి సోషల్ మీడియా,డిజిటల్ వేదికలలో టీచర్స

|
Google Oneindia TeluguNews

సెప్టెంబర్ 5... టీచర్స్ డే వచ్చిందంటే స్కూల్స్ లో, కళాశాలల్లో విద్యార్థుల సందడి అంతా ఇంతా కాదు. టీచర్స్ డే సందర్భంగా, తమ టీచర్స్ కు , తమకు ఉన్న అవినాభావ సంబంధాన్ని తెలియజేయడం కోసం మూడు నాలుగు రోజులు ముందు నుంచి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కళాశాలలు,పాఠశాలలను టీచర్స్ డే సందర్భంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతారు.తమకు విద్యాబుద్ధులు నేర్పించే టీచర్లను చాలా ప్రత్యేకంగా గౌరవించడమే కాకుండా, వారితో తమకు ఉన్న అనుబంధాన్ని, వారి ద్వారా తాము నేర్చుకుంటున్న విజ్ఞానాన్ని అందరికీ తెలిసేలా సంబరాలు జరుపుకుంటారు.కానీ కరోనా కారణంగా ఈ సారి ఆ హడావిడి కనిపించటం లేదు.

Teachers day 2020 : గురువే దైవం ... టీచర్స్ డే గొప్పతనం, సెప్టెంబర్ 5 నే జరుపుకునే కారణం ఇదేTeachers day 2020 : గురువే దైవం ... టీచర్స్ డే గొప్పతనం, సెప్టెంబర్ 5 నే జరుపుకునే కారణం ఇదే

 టీచర్స్ డే సందర్భంగా చిన్నారులే టీచర్లు .. ఈసారి కనిపించని వేడుకలు

టీచర్స్ డే సందర్భంగా చిన్నారులే టీచర్లు .. ఈసారి కనిపించని వేడుకలు

టీచర్స్ డే వచ్చిందంటే చిన్నారులే టీచర్స్ గా అవతారం ఎత్తుతారు. బుడిబుడి అడుగుల బుడతడు సైతం, బెత్తం పట్టుకొని , వచ్చీరాని మాటలతో పాఠాలు చెప్తారు. బోలెడు పూలు తీసుకెళ్ళి తమకు ఇష్టమైన టీచర్లకు ఇచ్చి సంబరాపడతారు. తమ టీచర్లు లాగే పాఠాలు చెప్పాలని, ముందు నుంచే తెగ ప్రిపేర్ అవుతారు. టీచర్స్ డే అంటే స్కూల్స్ , కాలేజీలలో ఒక పండుగ దినం. ఒక వేడుక. అలాంటి వేడుక ఈ సంవత్సరం కరోనా వైరస్ మహమ్మారి కారణంగా జరుపుకోలేని పరిస్థితి నెలకొంది. విద్యార్థులు స్కూల్స్, కాలీజీలు తెరవకపోవటంతో ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో విద్యార్థి లోకం తీవ్ర ఆవేదనకు గురి అవుతోంది.

 తొలిసారిగా ఆన్ లైన్ , సోషల్ మీడియాలలో టీచర్స్ డే

తొలిసారిగా ఆన్ లైన్ , సోషల్ మీడియాలలో టీచర్స్ డే

1962నుండి ఇప్పటి వరకు ఎప్పుడూ టీచర్స్ డే జరుపుకోకుండా లేము . కానీ ఈ సారి తొలిసారిగాఆన్ లైన్ లో , డిజిటల్ వేదికల మీద టీచర్స్ డే జరుగుతుంది. ఆన్ లైన్ లోనూ, సోషల్ మీడియాలోనూ తమ గురువులతో తమకు ఉన్న అవినాభావ సంబంధాన్ని, తమను ఉన్నతంగా తీర్చిదిద్దిన గురువుల బోధన విధానాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా అందుకు కారణం తమకు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులేనని డిజిటల్ ప్లాట్ ఫామ్ ల ద్వారా అందరికీ చెప్తున్నారు.

 ఈసారి టీచర్స్ డే సందర్భంగా ఉపాధ్యాయులు చిన్నారులను బాగా మిస్ అవుతున్నారు.

ఈసారి టీచర్స్ డే సందర్భంగా ఉపాధ్యాయులు చిన్నారులను బాగా మిస్ అవుతున్నారు.

కరోనా కారణంగా టీచర్స్ డే వేడుకలకు దూరంగా కరోనా కారణంగా ఇంతకాలం స్కూల్స్,కళాశాలలు లేకపోవడం మాత్రమే కాకుండా ఇప్పుడు ఉపాధ్యాయ దినోత్సవం రోజు తాము అమితంగా ఇష్టపడే విద్యార్థులను కలుసుకోకపోవడం వారిని తీవ్ర మనోవేదనకు గురిచేస్తుంది. తమ వద్ద విద్యాబుద్ధులు నేర్చుకున్న విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలంటే, అంతకుమించి ఆ టీచర్ కోరుకునేది ఏది ఉండదు. తమ విద్యార్థులు సాధించిన విజయాలను గర్వంగా చెప్పుకుంటూ సంతోషపడే టీచర్లు నేడు టీచర్స్ డే సందర్భంగా తమ విద్యార్థులతో తాము సాగించిన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

Recommended Video

#Coronavirusindia : భారత్ లో రికార్డు స్థాయి లో నమోదు అవుతున్న Corona కేసులు | #IndiaFightsCorona
తమ ఉన్నతికి కారణమయిన టీచర్లను స్మరించుకునే సంస్కృతి ..గురుభ్యో నమః

తమ ఉన్నతికి కారణమయిన టీచర్లను స్మరించుకునే సంస్కృతి ..గురుభ్యో నమః

ప్రస్తుతం ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తున్న తరుణంలో, ఆన్ లైన్ ద్వారానే విద్యార్థులకు టీచర్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. టీచర్స్ తో ఉన్న అనుబంధాన్ని విద్యార్థులు పంచుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ టీచర్స్ డే ఒకింత బాధాకరంగా జరుగుతున్నా, టీచర్లకు విద్యార్థులపై ఉన్న అవ్యాజమైన ప్రేమ, విద్యార్థులకు టీచర్లపై ఉన్న అమితమైన గౌరవం, భక్తి భావం అలానే కొనసాగుతాయి.తమకు విద్యాబుద్ధులు నేర్పించి, తమ ఉన్నతికి కారణమైన టీచర్లను వృద్ధాప్యంలో కూడా గుర్తు చేసుకునే గొప్ప సంస్కృతి మనలో ఉంది. అందుకే ఆన్లైన్ లో టీచర్స్ డే వేడుకలు జరుపుకుంటున్న విద్యార్థి లోకమంతా చెబుతోంది గురుభ్యో నమః .

English summary
Teachers' Day has come and children are incarnated as teachers. Lots of flowers are given to their favorite teachers to celebrate. The students are going to teach lessons like their teachers. Teachers' Day is a festival day in schools and colleges. A celebration. Such a celebration could not be celebrated this year due to the corona virus epidemic. Students were confined to their homes as schools and colleges did not open. With this, the student world is becoming very dull. only the teachers day rememberance in digital platforms and online , social media
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X