• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Teachers day 2020 : గురువే దైవం ... టీచర్స్ డే గొప్పతనం, సెప్టెంబర్ 5 నే జరుపుకునే కారణం ఇదే

|

అజ్ఞానమనే చీకటి లో ఉన్నవారికి, విజ్ఞానమనే దారిని చూపి వారి జీవితాల్లో వెలుగులు నింపే వారే ఉపాధ్యాయులు. గురువు అనుగ్రహం కలిగిన నాడు అజ్ఞాని కూడా జ్ఞానవంతుడు అవుతాడు. ప్రతి ఏటా సెప్టెంబర్ 5వ తేదీన మన జీవితాల్లో వెలుగులు నింపుతున్న టీచర్లను స్మరించుకుంటూ టీచర్స్ డే జరుపుకుంటున్నాము . ప్రపంచ వ్యాప్తంగా టీచర్స్ డే ను అక్టోబర్ 5న జరుపుకుంటే భారతదేశంలో మాత్రం సెప్టెంబర్ 5న సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించుకోవడం జరుగుతుంది . భారతదేశంలో సెప్టెంబరు 5 టీచర్స్ డే వేడుకలు జరుపుకోవడానికి వెనుక ఎన్నో కారణాలున్నాయి.

  Teachers Day 2020 : అందుకే ఉపాధ్యాయ వృత్తి అంత గొప్పది, ఉపాధ్యాయులు అంతటి గొప్ప వారు...!! | Oneindia

  Father's Day 2020 : నాన్నే సూపర్ హీరో.. పోస్టులు, గిఫ్టులు కాదు .. నాన్నకు కావాల్సిందిదే !!Father's Day 2020 : నాన్నే సూపర్ హీరో.. పోస్టులు, గిఫ్టులు కాదు .. నాన్నకు కావాల్సిందిదే !!

  సెప్టెంబర్ 5న టీచర్స్ డే ...ప్రతి ఏటా స్కూళ్ళు , కాలేజీల్లో వేడుకలు

  సెప్టెంబర్ 5న టీచర్స్ డే ...ప్రతి ఏటా స్కూళ్ళు , కాలేజీల్లో వేడుకలు


  1962 వ సంవత్సరం నుండి సెప్టెంబర్ 5వ తేదీన ప్రతి ఏడాది డాక్టర్. సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజున ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఆరోజు మనకు విద్యా బోధన చేసిన గురువులను స్మరించుకుంటాము. మన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన, మనం ఉన్నతంగా ఎదగడానికి తోడ్పాటు నందించిన గురువులను గుర్తు చేసుకొంటాము. వారిని పూజిస్తాము. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటూ గురువులను స్మరించటమే కాకుండా టీచర్స్ పై ఉన్న భక్తి ప్రస్పుటం అయ్యేలా పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకుంటాం. ఇక పాఠశాలలు, కళాశాలలలో సందడే సందడి.

  భారత రాష్ట్రపతిగా పని చేసిన డాక్టర్ . సర్వేపల్లి రాధాకృష్ణన్ గొప్ప గురువు

  భారత రాష్ట్రపతిగా పని చేసిన డాక్టర్ . సర్వేపల్లి రాధాకృష్ణన్ గొప్ప గురువు

  అసలు సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజునే ఎందుకు టీచర్స్ డే గా జరుపుకుంటాము అన్నది చాలా మంది మనసులోని ప్రశ్న . ఇక దానికి జవాబు ఈ కథనంతో అర్ధం అవుతుంది. భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశ తొలి ఉపరాష్ట్రపతిగా, రెండవ రాష్ట్రపతిగా పని చేశారు. 1988లో తిరుత్తణిలో ఆయన జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ నుంచి ఫిలాసఫీ లో మాస్టర్ డిగ్రీ చదువుకున్నారు. కలకత్తా, మైసూర్ యూనివర్సిటీ లలో ఆయన లెక్చరర్ గా పనిచేశారు. చాలా మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దారు.

  తన పుట్టిన రోజు వేడుకలు వద్దన్న గురువు ... అందుకే ఇలా ...

  తన పుట్టిన రోజు వేడుకలు వద్దన్న గురువు ... అందుకే ఇలా ...

  ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగిన ఆయన సర్వేపల్లి రాధాకృష్ణన్ ఏ రోజు తన పుట్టినరోజును జరుపుకోవాలని కోరుకోలేదట. విద్యార్థులు ఎవరైనా పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తామని ఆయనని అడిగితే వద్దని వారించే వారట. విద్యార్థులు అంటే అమితమైన ఇష్టాన్ని ప్రదర్శించే ఆయన, విద్యార్థులు గురువుల పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండాలని చెప్పేవారట. అందుకే ఆయన పుట్టిన రోజున అందరూ ఉపాధ్యాయులను గౌరవిస్తూ టీచర్స్ డే వేడుకలను జరుపుతున్నారు. అది అప్పటి నుండి ఇప్పటి వరకు ఆనవాయితీగా వస్తుంది.

  మహర్షి , గొప్ప గురువు సర్వేపల్లి గురించి మహనీయుల అభిప్రాయాలు

  మహర్షి , గొప్ప గురువు సర్వేపల్లి గురించి మహనీయుల అభిప్రాయాలు

  భారతదేశంలో ఆనాడు ఉన్న మత ఆధ్యాత్మిక పునరుద్ధరణ వాదాన్ని అకడమిక్ తాత్విక స్థాయికి తీసుకువెళ్ళిన గొప్ప పండితులు సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన 15 సార్లు నోబెల్ సాహిత్య బహుమతి కి, 11 సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ అందరూ గురువులకే గురువు గా భావించేవారు. సర్వేపల్లి తనకు కృష్ణుడితో సమానమని జాతిపిత మహాత్మాగాంధీ కీర్తించారు. యుగ పురుషుల గురించి ఉపన్యాసం ఇవ్వండి అని పిలిస్తే యుగపురుషుడే వచ్చారు అని సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉద్దేశించి కీర్తించారు హోవెల్. నాలో మామూలు మనిషిని దర్శించిన మహర్షి అంటూ సోవియట్ అధినేత స్టాలిన్ ఆయన గొప్పతనాన్ని చెప్పారు.

  సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజునే టీచర్స్ డే గా

  సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజునే టీచర్స్ డే గా

  మీరు నా కృష్ణుడు నేను మీ అర్జునుడిని అని గాంధీజీ మాటలను బట్టి ఆయన ఒక గీతాచార్యుడు గా కీర్తించబడ్డారు. అన్నిటికంటే ఆయన గొప్ప ఉపాధ్యాయుడు. ఎంతోమంది విద్యార్థులు ఉన్నతంగా తీర్చిదిద్దిన గొప్ప గురువు. ప్రతి ఒక్కరూ ఆయనలాగా విద్యార్థులు ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతోనే , ఆయనను స్మరిస్తూ, ఆయన మార్గంలో పయనించాలని దిశానిర్దేశం చేస్తూ ఆయన పుట్టిన రోజును టీచర్స్ డే గా జరపాలని నిర్ణయం తీసుకుంది కేంద్రం . పండిట్ జవహర్ లాల్ నెహ్రూ తీసుకున్న ఈ నిర్ణయానికి సర్వేపల్లి గొప్పతనమే కారణం . గాంధీ , హొవెల్ వంటి మహనీయులు కూడా ఆయనను గురువులకే గురువుగా గుర్తించటం కారణం .

  గురువుల బాధ్యత గుర్తు చేస్తూ , విజ్ఞాన జ్యోతిని వెలిగించిన గురువులను స్మరిస్తూ

  గురువుల బాధ్యత గుర్తు చేస్తూ , విజ్ఞాన జ్యోతిని వెలిగించిన గురువులను స్మరిస్తూ

  ఏ రంగంలో అయినా, ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఎవరైనా సరే ఉపాధ్యాయుల వద్ద విద్యాబుద్ధులు నేర్చుకున్న వారే. గురువులు అందించిన విజ్ఞానంతో, సంస్కార సౌజన్యాలతో పైకి ఎదిగిన వారే. పిల్లల బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో ఉపాధ్యాయుడిదే కీలకపాత్ర . ఇంతటి మహత్తర కార్యాన్ని నిర్వర్తించే గురువు కలకాలం తలెత్తుకు జీవించవచ్చు. ఇంత గొప్ప గొప్ప అవకాశం మరెవ్వరికీ దక్కదని రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహానుభావులు చెప్పారు. ఉపాధ్యాయ వృత్తి అంత గొప్పది, ఉపాధ్యాయులు అంతటి గొప్ప వారు. కాబట్టి టీచర్స్ డే విద్యార్థులకు ఒక పండుగ రోజు. గురువులకు గురుతరమైన బాధ్యతను గుర్తు చేసే రోజు. గొప్ప గురువు సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు .

  English summary
  In India, Teachers’ Day is celebrated annually on September 5 to mark the birthday of the country’s former President, scholar, philosopher and Bharat Ratna awardee, Dr Sarvepalli Radhakrishnan, who was born on this day in 1888. The significance of this day is ever-evolving, including taking lessons from life and making your experiences the teachers you needed to shape you into who you become.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X