వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీలో కొత్త రూల్!?: టీచర్స్ జీన్స్, టీషర్ట్ ధరించవద్దు..

ఉపాధ్యాయ వృత్తి పట్ల గౌరవం పెంచేవిధంగా వారి వస్త్రధారణ ఉండాలని, అందుకే జీన్స్, టీషర్ట్ వంటి వస్త్రధారణలో ఉపాధ్యాయులు పాఠశాలలకు రావద్దని సూచించారు.

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఉపాధ్యాయుల వస్త్రధారణకు సంబంధించి కొత్త నిబంధనలను తీసుకొచ్చే ప్రయత్నం జరగుతోంది.ఈ మేరకు ఇకనుంచి ఉపాధ్యాయులు పాఠశాలలకు జీన్స్, టీషర్ట్ వేసుకుని రావద్దని లక్నో ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ స్కూల్స్‌(డీఐవోఎస్‌) ఉమేశ్‌ త్రిపాఠి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయ వృత్తి పట్ల గౌరవం పెంచేవిధంగా వారి వస్త్రధారణ ఉండాలని, అందుకే జీన్స్, టీషర్ట్ వంటి వస్త్రధారణలో ఉపాధ్యాయులు పాఠశాలలకు రావద్దని సూచించారు.

ఇదే విషయాన్ని త్వరలో ఉన్నతాధికారులతో చర్చిస్తానని ఉమేశ్ త్రిపాఠి అన్నారు. వస్త్రధారణ మాత్రమే గాక ప్రతీ పాఠశాల శుభ్రంగా ఉండటంతో పాటు, అన్ని పాఠశాలలో ఉదయం పూట తప్పనిసరిగా ప్రార్థనలు జరిగాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే పాఠశాలకు సమీపంలో పాన్ మసాలా, సిగరెట్లు వంటి వాటిని విక్రయించే దుకాణాలను మూసివేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Teachers should not wear jeans and Tshirts says Umesh Tripathi

కాగా, హర్యానా ప్రభుత్వం ఉపాధ్యాయుల వస్త్రధారణ పట్ల గతేడాది కొన్ని నిబంధనలను విధించిన సంగతి తెలిసిందే. జీన్స్ పాయింట్ ధరించి పాఠశాలలకు రావద్దని అక్కడి ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసింది.

English summary
Umesh Tripathi, District Inspector of schools in lucknow was made a interesting statement that teachers should not wear Jeans and Tshirts in schools
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X