వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తలైవా ఆన్ ఫైర్: ఫుల్ ఎనర్జీతో రజినీకాంత్: మ్యాన్ వర్సెస్ వైల్డ్ టీజర్ అవుట్: టెలికాస్ట్ ఎప్పుడంటే..?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: దక్షిణాది సూపర్‌స్టార్ రజినీకాంత్ కనిపించిన మ్యాన్ వర్సెస్ వైల్డ్ అడ్వెంచర్ యాక్షన్ ప్యాక్డ్ ఎపిసోడ్స్ టీజర్ విడుదలైంది. ఈ ఎపిసోడ్లను ప్రసారం చేయబోతున్న డిస్కవరీ ఛానల్ యాజమాన్యం ఈ టీజర్‌ను గురువారం ఉదయం ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో చిత్రీకరించిన ఈ సాహసకృత్యాలకు సంబంధించిన ఎపిసోడ్లు తలైవా ఫ్యాన్స్‌కు విందు భోజనాన్ని పెట్టనున్నాయి. పశ్చిమ కనుమల అందాల మధ్య తలైవా యాక్షన్ సీన్స్.. కనువిందు చేయబోతున్నాయి.

Recommended Video

Man Vs Wild : Rajinikanth With Bear Grylls, New Promo Out! | Oneindia Telugu
 నెరిసిన గడ్డం.. కూలింగ్ గ్లాసెస్‌తో క్లోజప్ షాట్‌లో సూపర్‌స్టార్..

నెరిసిన గడ్డం.. కూలింగ్ గ్లాసెస్‌తో క్లోజప్ షాట్‌లో సూపర్‌స్టార్..

నెరిసిన గడ్డం.. కూలింగ్ గ్లాసెస్.. లెదర్ జాకెట్‌తో రజినీకాంత్ కనిపించేది కొన్ని సెకెన్లే. అయినప్పటికీ.. ఆయనలోని ఫైర్, జోష్ ఈ టీజర్‌లో కనిపించింది. 40 సెకెన్ల నిడివి ఉన్న మ్యాన్ వర్సెస్ వైల్డ్ టీజర్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసిన కొన్ని నిమిషాల్లోనే లక్షలాది మంది తిలకించారు. రజినీ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. కర్ణాటకలోని చామరాజ నగర జిల్లా బండీపూర్ అభయారణ్యం, పులుల సంరక్షణా కేంద్రంలో కిందటి నెల 28వ తేదీ నుంచి ఈ అడ్వెంచర్ ఎపిసోడ్లను చిత్రీకరించిన విషయం తెలిసిందే.

టెలికాస్ట్ ఎప్పుడంటే..

టెలికాస్ట్ ఎప్పుడంటే..

బేర్ గ్రిల్స్‌తో రజినీకాంత్ కనిపించిన ఈ ఎపిసోడ్లను వచ్చేనెల 23వ తేదీన రాత్రి 8 గంటలకు ప్రసారం అవుతుంది డిస్కవరీ ఛానల్‌లో. ఫుల్ ఎపిసోడ్లు టెలికాస్ట్ అవుతాయి. ఈ తరహా రియలిస్టిక్ అడ్వెంచర్ డాక్యుమెంటరీలో రజినీకాంత్ కనిపించడం ఇదే తొలిసారి. దీనితో అభిమానులు రజినీకాంత్‌ను ఎప్పుడెప్పుడు చూస్తామనే ఉత్సాహంలో ఉన్నారు. పైగా మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఎపిసోడ్లు ఎంత కఠినంగా ఉంటాయో వాటిని క్రమం తప్పకుండా చూసే వారికి తెలిసిన విషయమే. దాని స్థాయికి తగినట్లుగా రజినీకాంత్ కనిపించారని బేర్ గ్రిల్స్ చెప్పుకొచ్చారు.

మనదేశంలో రెండోసారి..

మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఎపిసోడ్లను మనదేశంలో చిత్రీకరించడం ఇది రెండోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బేర్ గ్రిల్స్‌తో గత ఏడాది మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఎపిసోడ్లను చిత్రీకరించారు. ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో నరేంద్ర మోడీతో దీనికి సంబంధించిన సన్నివేశాలను షూట్ చేశారు. సరిగ్గా ఏడాది తిరిగేలోపే మరోసారి డిస్కవరీ ఛానల్ యాజమాన్యం మనదేశానికే వచ్చింది. దక్షిణాది సూపర్‌స్టార్ రజినీని తన లేటెస్ట్ ఎపిసోడ్ల కోసం ఎంపిక చేసింది.

English summary
Almost a month after British adventurer Bear Grylls and southern superstar Rajinikanth shot for Discovery Channel's show 'Into the Wild' in Karnataka's national park, the channel released a teaser of the episode and announced that it will premiere on March 23. Sharing the teaser, Discovery Channel India tweeted, "Gear up to venture into the wilderness of India with survival expert BearGrylls and the ultimate superstar Rajinikanth in an action-packed adventure. Premieres 23 March at 8 PM, only on Discovery #ThalaivaOnDiscovery."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X