వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలకు షాక్: సీనియర్ ఉద్యోగులకు అప్రైజల్ సైకిల్ నిలిపివేత, జూలై తర్వాతే కొత్త వేతనాలు

ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న పరిస్థితుల కారణంగా ఐటి కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు:ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న పరిస్థితుల కారణంగా ఐటి కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకొంటున్నాయి. అయితే వేతనాల పెంపు కోసం ఆశగా ఎదురుచూస్తోన్న ఉద్యోగులకు నిరాశే మిగలనుంది. వేతనాల పెంపుపై టెక్ మహీంద్రా కంపెనీ నీళ్ళు చల్లింది.ఆరేళ్ళ కంటే ఎక్కువ అనుభవం ఉన్న ఉద్యోగుల అప్రైజల్ సైకిల్ ను నిలిపివేస్తున్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది.

ప్రపంచ వ్యాప్తంగా ఐటి కంపెనీలు ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకొన్న తర్వాత ఐటి కంపెనీలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంది.

ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకొన్న తర్వాత వెలువడిన నిర్ణయాలతో దేశీయ ఐటి కంపెనీలు ఒడిదొడుకులకు గురౌతున్నాయి.

ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాలను ఐటి కంపెనీలు వెతుక్కొంటున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకొనే మార్గాలను అన్వేషిస్తున్నాయి కొన్ని కంపెనీలు.

సీనియర్ ఉద్యోగుల అప్రైజల్ సైకిల్ ను నిలిపివేసిన టెక్ మహీంద్ర

సీనియర్ ఉద్యోగుల అప్రైజల్ సైకిల్ ను నిలిపివేసిన టెక్ మహీంద్ర

పెరుగుతున్న వీసా వ్యయాలు , క్లయింట్ల నుండి వస్తోన్న సర్వీసు ధరల తగ్గింపు డిమాండ్ల ను దృష్టిలో ఉంచుకొని టెక్ మహీంద్ర కంపెనీ వేతనాల పెంపుపై ఆశతో ఉన్న ఉన్న ఉద్యోగులకు నిరాశను మిగిల్చింది.ఆరేళ్ళ కంటే ఎక్కువ అనుభవం ఉన్న ఉద్యోగుల అప్రైజల్ సైకిల్ ను నిలిపివేస్తున్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది.కంపెనీ మేనేజ్ మెంట్ సమీక్ష సందర్భంగా ఈ నిర్ణయం తీసుకొంది

టీమ్ లీడర్లు, ఆ పై స్థాయివారిపై ప్రభావం

టీమ్ లీడర్లు, ఆ పై స్థాయివారిపై ప్రభావం

ఆరేళ్ళ అనుభవం ఉన్న ఉద్యోగుల అప్రైజల్ సైకిల్ ను నిలిపివేయాలని టెక్ మహీంద్ర కంపెనీ తీసుకొన్న నిర్ణయం కారణంగా టీమ్ లీడర్లు, ఆపై స్థాయి ఉన్నవారిపై ప్రభావం కలిగే అవకాశం ఉంది. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎల్. రవిచంద్రన్ నేతృత్వంలో మరో ముగ్గురు టెక్ ఉద్యోగులు పాల్గొన్న వెబీనార్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. టీమ్ లీడర్లు , ఆ పై స్థాయి వారు దీని ప్రభావానికి గురౌతారని చెప్పారు.

వేతనాల పెంపు కోసం ఇంకా రెండు మాసాలు ఎదురుచూడాల్సిందే

వేతనాల పెంపు కోసం ఇంకా రెండు మాసాలు ఎదురుచూడాల్సిందే

వేతనాలు పెంచాలని ఆశిస్తున్న వారు కనీసం రెండు త్రైమాసికాలు వేచి చూడాల్సిన అవసరం ఉంది. అప్రైజల్ ను నిరవధికంగా వాయిదా వేయడం లేదని టెక్ మహీంద్ర కంపెనీ ప్రకటించింది. మేనేజ్ మెంట్ సమీక్ష అనంతరం పెంపు గురించి ప్రభావిత ఉద్యోగులకు తాము తెలిపినట్టు ఆ కంపెనీ ప్రకటించింది.మూడో క్వార్టర్ లో వచ్చిన ఫలితాలకు అనుగుణంగా తాము ఈ నిర్ణయాన్ని తీసుకోలేదని ఆ కంపెనీ ప్రకటించింది.

జూలై నుండి కొత్త వేతనాలు

జూలై నుండి కొత్త వేతనాలు


మేనేజ్ మెంట్ సమీక్షల్లో భాగంగానే అప్రైజల్ సైకిల్ ను నిలిపివేయాలనే నిర్ణయం తీసుకొన్నట్టు కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. టెక్ మహీంద్రకు మూడో క్వార్టర్ లో రెవిన్యూ 4 శాతం మేర పెరిగింది. ఇతర ఉద్యోగుల పరిహరాలను మార్లో జరగబోయే సమీక్షలో నిర్ణయించనున్నారు. కానీ, జూలై నుండి కొత్త వేతనాలను అమల్లోకి తీసుకురానున్నారు.

ట్రంప్ నిర్ణయాల వల్లే నిర్ణయాలు

ట్రంప్ నిర్ణయాల వల్లే నిర్ణయాలు

అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ బాధ్యతలు తీసుకొన్న తర్వాత నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఐటి కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నాయి.క్లయింట్ల నుండి వస్తోన్న ధరల తగ్గింపు డిమాండ్లు, ఉద్యోగుల వేతనాలకు గండికొడుతున్నట్లు తెలుస్తోంది. అనుభవమున్నవారికి ఎక్కువ వేతనాలు ఇవ్వడం కంటే కొత్తగా వస్తోన్న ప్రతిభావంతులైనవారికి ఉద్యోగాలు కల్పించాలని కంపెనీలు భావిస్తున్నట్టు సమాచారం.

ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న పరిస్థితుల కారణంగా ఐటి కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకొంటున్నాయి. అయితే వేతనాల పెంపు కోసం ఆశగా ఎదురుచూస్తోన్న ఉద్యోగులకు నిరాశే మిగలనుంది. వేతనాల పెంపుపై టెక్ మహీంద్రా కంపెనీ నీళ్ళు చల్లింది.ఆరేళ్ళ కంటే ఎక్కువ అనుభవం ఉన్న ఉద్యోగుల అప్రైజల్ సైకిల్ ను నిలిపివేస్తున్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది.

English summary
tech mahindra has suspended the appraisal cycle for employees with more than six years of experience pending a management review, as the i.t. industry grapples with deep changes to the way it does business.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X