వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: టెక్ మహీంద్రాలో టాప్ ఎగ్జిక్యూటివ్‌ల వేతనాల్లో కోత

టెక్ మహీంద్రాలోని టాప్ ఎగ్జిక్యూటివ్‌ల వేతనానికి కోత పడింది. కంపెనీలోని ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ , సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ర్యాంకు కలిగిన టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు 10 నుండి 20 శాతం కోత పెడుతున్న

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: టెక్ మహీంద్రాలోని టాప్ ఎగ్జిక్యూటివ్‌ల వేతనానికి కోత పడింది. కంపెనీలోని ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ , సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ర్యాంకు కలిగిన టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు 10 నుండి 20 శాతం కోత పెడుతున్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది.

గత కొన్ని త్రైమాసికాలుగా కంపెనీ ప్రకటించింది. గత కొన్ని త్రైమాసికాలుగా కంపెనీ పేలవమైన పనితీరు కనబరుస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకొన్నారు.

Tech Mahindra top execs take 10-20% pay cut

20 మంది ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీ సీఈవో సీపీ గుర్నాని, చీఫ్ పీపుల్ ఆఫీసర్ రాకేష్, సోనీలకు లేఖలు రాశారు. మేనేజ్‌మెంట్ నుంచి టాప్ ఎగ్జిక్యూటివ్‌ల వరకు అందరం దీన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు.

మేనేజ్‌మెంట్ తీసుకొన్న ఈ నిర్ణయం గర్నాని, రాకేష్ సోనీలపై ప్రభావం చూపనుంది. కంపెనీ తీరు మెరుగుపడిన తర్వాత వేతనాలు పునరుద్దరణ అవుతాయన్నారు. వైఎస్ ప్రెసిడెంట్ స్థాయి నుండి ఆపై స్థాయి 500 మంది ఎగ్జిక్యూటివ్‌ల వేతన పెంపును వాయిదా వేసిన టెక్ మహీంద్రా వేతనాన్ని పెంచకపోగా, ఈ వేతన కోతను ఆఫర్ చేసింది.

ఆరేళ్ళ అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్‌లకు ఈ నిర్ణయం వర్తించనుంది. ప్రస్తుతం టాప్ ఐటీ సర్వీసు కంపెనీల టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ఒత్తిడిలో కొనసాగుతోంది. ఇన్పోసిస్ కూడ జాబ్‌లెవల్7, ఆపై స్థాయి సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల వేతనాల పెంపును వాయిదా వేసింది.

కాగ్నిజెంట్ కంపెనీ అయితే ఏకంగా వాలంటరీ సెపరేషన్ ఇన్సెంటివ్‌ను ఆఫర్ చేసింది. ఐటీ వ్యయాలు తగ్గడం , కొత్త డిజిటల్ టెక్నాలజీల వైపు క్లయింట్లు మొగ్గుచూపుతుండడంతో ఐటీ ఇండస్ట్రీలో ఈ పరిస్థితి నెలకొందని నిపుణులు అభిప్రాయంతో ఉన్నారు.

English summary
Top executives in the ranks of executive VP and senior VP in Tech Mahindra have offered to take a pay cut of 10%-20% because of the company's lacklustre performance over the past few quarters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X