బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రమాదవశాత్తు బాల్కనీ నుండి పడి టెక్కీ మృతి

31 ఏళ్ళ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రమాదవశాత్తు బాల్కనీ నుండి విద్యుత్ వైర్లపై పడి చనిపోయాడు.ఈ ఘటన బెంగుళూరులో గురువారం నాడు చోటుచేసుకొంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: 31 ఏళ్ళ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రమాదవశాత్తు బాల్కనీ నుండి విద్యుత్ వైర్లపై పడి చనిపోయాడు.ఈ ఘటన బెంగుళూరులో గురువారం నాడు చోటుచేసుకొంది.

కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులోని యశ్వంత్ పూర్ లో విద్యాశంకర్ మిశ్రా నివాసం ఉంటున్నారు. అతను ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు. ఐటిపిఎల్ లో సీనియర్ టెస్ట్ ఎనలిస్టుగా పనిచేస్తున్నాడు. అతను యశ్వంత్ పూర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇంటిలో నివాసం ఉంటున్నాడు.

Techie falls on live wire, body found hanging in the morning

విద్యాశంకర్ సోదరుడు విద్యాదీపక్ మిశ్రా విద్యుత్ షాక్ తో తన సోదరుడు చనిపోయిన విషయాన్ని గురువారం ఉదయం పూట చూశాడు. దీంతో ఆయన స్థానికులు, పోలీసుల, విద్యుత్ శాఖాధికారుల సహయంతో విద్యుత్ వైర్లపై పడిన మృతదేహన్ని బయటకు తీశారు.

స్థానికులు బెంగుళూరు పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే బెంగుళూరు పోలీసులు విద్యుత్ శాఖాధికారులకు సమాచారమిచ్చారు. విద్యుత్ ను నిలిపివేసి డెడ్ బాడీని బయటకు తీశారు.

ఎప్పుడైనా రాత్రి పూట భోజనం చేసే ముందు మద్యం తాగే అలవాటు ఉందని దీపక్ చెప్పారు. బుదవారం రాత్రి పూట కూడ ఇద్దరం కలిసి మద్యం సేవించినట్టుగా ఆయన చెప్పారు. రాత్రి 1 గంటవరకు మద్యం తాగామన్నారు అయితే తాను డిన్నర్ చేసి పడుకోవాలని సోదరుడు చెప్పాడన్నారు.అయితే తాను మాత్రం కొద్దిసేపు బాల్కనీలోనే పచార్లు చేశాడన్నారు.

అయితే తాను భోజనం చేసి పడుకొన్నానని దీపక్ చెప్పారు. అయితే బాల్కనీలో వాకింగ్ చేస్తున్న సమయంలో బ్యాలెన్స్ తప్పి కిందకు పడిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

English summary
A 31-year-old software engineer who had a few drinks with his younger brother, was electrocuted when he accidentally fell from the balcony of his residence on to the live wire of an electric pole outside the house in Yeshwantpur, north Bengaluru, in the early hours of Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X