వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్యోగం పోయింది.. భార్య, కవల పిల్లలతో కలిసి టెకీ...

|
Google Oneindia TeluguNews

ఉన్న ఉద్యోగం కోల్పోయింది. భార్య, పిల్లలు పోషణ ఎలా అనుకున్నాడు ఆ టెకీ, విషయాన్ని తన భార్యకు చెప్పాడు. అతని వైఫ్ కూడా జాబ్ చేస్తున్నారు. కానీ కుటుంబ పోషణకు అవసరమయ్యే నగదు సంపాదించడం లేదు. దీంతో భార్య భర్తలు ఒక నిర్ణయం తీసుకున్నారు. తమ పిల్లలతో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డాలని డిసిషన్ తీసుకొని.. ప్రణాళికను కచ్చితంగా పాటించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ఆత్మహత్య కలకలం రేపింది.

నరేంద్ర మోడీ గుడ్‌న్యూస్.. కేంద్ర ఉద్యోగులకు భారీ ఊరట

ఉద్యోగం పోవడంతో

ఉద్యోగం పోవడంతో

అభిషేక్ సక్సేనా అనే సాప్ట్‌వేర్ ఇంజినీర్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పనిచేస్తున్నాడు. అతని భార్య ప్రీతి సక్సేనా కూడా ఎంఎన్సీ కంపెనీలో విధులు నిర్వహిస్తోంది. వీరికి ఇద్దరు కవల పిల్లలు కూడా ఉన్నారు. అభిషేక్ ఇండోర్‌లోని పాలాసియా సాప్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే ఇటీవల అతని ఉద్యోగం పోయింది. అప్పటివరకు విలాసవంతంగా జీవించిన వారు.. తమ ఖర్చులకు కూడా తీవ్ర ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది.

రిసార్ట్‌లోనే

రిసార్ట్‌లోనే

ప్రీతి చేస్తోన్న ఉద్యోగంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. దీంతో అభిషేక్ ఏం చేయలేక మదనపడిపోయారు. తన భార్యతో కలిసి ఏం చేయాలని నిర్ణయించుకున్నారు. తమకు ఆత్మహత్య తప్ప మరో మార్గం కనపించడం లేదనుకున్నారు. తమ కవల పిల్లలు అద్వైత్, అనన్యతో కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇండోర్‌లోని తమ రిసార్ట్‌లో బలవన్మరణానికి పాల్పడ్డారు. సోడియం నైట్రేట్ తీసుకొని తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయారు.

విగతజీవులుగా ..

విగతజీవులుగా ..

ఎలా చనిపోవాలని వారు మదనపడి చివరకు ఆన్‌లైన్‌లో సోడియం నైట్రైట్ కొనుగోలు చేశారు. రిసార్టులో తొలుత పిల్లలకు ఇచ్చి, తర్వాత భార్యతో కలిపి అభిషేక్ తీసుకున్నాడు. గురువారం తెల్లవారుజామున సిబ్బంది వచ్చి చూస్తే తలుపు వేసి ఉంది. ఎంతకు డోర్ తీయకపోవడంతో మాస్టర్ కీ తో తలుపు తెరిచారు. అభిషేక్, భార్య, పిల్లలు సహా నలుగురు విగతజీవులుగా పడి ఉన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు.

నీలం రంగులోకి గోర్లు

నీలం రంగులోకి గోర్లు

అభిషేక్ గోర్లు నీలం రంగులోకి మారిపోయింది. నోటిలోంచి నురుగు రావడం గమనించారు. పక్కనే సోడియం నైట్రేట్ బాటిల్ కూడా ఉంది. ఘటనాస్థలం నుంచి అభిషేక్ ల్యాప్‌ట్యాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగం పోవడంతో అభిషేక్ ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. నాలుగు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి ఢిల్లీలోని అభిషేక్ బంధువులుకు అప్పగించారు.

కారణమిదేనా?

కారణమిదేనా?

అభిషేక్‌ ఉద్యోగం పోవడంతోనే బలవన్మరణానికి పాల్పడ్డారా ? లేదంటే ఇతర కారణాలు ఉన్నాయా అని పోలీసులు విచారిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ట్రేడింగ్, బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నామని, ఈ-మెయిల్ కూడా చూస్తున్నామని పోలీసులు తెలిపారు. ల్యాప్‌ట్యాప్‌తోపాటు మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

English summary
techie found dead in Madhya Pradesh’s Indore with his wife, son and daughter was apparently under stress after losing his job. The police found evidence of online purchase of sodium nitrate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X