బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరులో ఫస్ట్ త్రిబుల్ తలాక్ కేసు, చిక్కుల్లో టెక్కీ: రూ. 30 లక్షలు దొబ్బాడు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: త్రిబుల్ తలాక్ బిల్లు అమలులోకి వచ్చిన తరువాత భార్య దగ్గరకు వెళ్లి తలాక్ తలాక్ తలాక్ అని చెప్పిన భర్త మీద బెంగళూరులో మొట్ట మొదటి కేసు నమోదు అయ్యింది. ఉద్యోగం ఉందని పొగరుతో తనకు తలాక్ పేరుతో విడాకులు ఇవ్వాలని భర్త వేధింపులకు గురి చేస్తున్నాడని, ఇప్పటికే కట్నం కింద రూ. 30 లక్షలు తీసుకున్నాడని, తాను న్యాయపోరాటం చేస్తానని అంటున్న ఓ మహిళ సాఫ్ట్ వేర్ ఇంజనీరు మీద బెంగళూరులో మొట్ట మొదటి కేసు పెట్టంది.

డీకే దెబ్బకు లేడీ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాళ్కర్ కు నోటీసులు, 317 బ్యాంక్ అకౌంట్లు, బినామి !డీకే దెబ్బకు లేడీ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాళ్కర్ కు నోటీసులు, 317 బ్యాంక్ అకౌంట్లు, బినామి !

బెంగళూరులోని గుర్రప్పనపాళ్యలో సమీరుల్లా రెహమత్ (38) అనే సాఫ్ట్ వేర్ ఇంజనీరు నివాసం ఉంటున్నాడు. ప్రసిద్ది చెందిన విప్రో కంపెనీలో సమీరుల్లా రెహమత్ సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. ఇతని భార్య దుబాయ్ లో ఇంజనీరింగ్ విద్యాభ్యాసం పూర్తి చేసింది.

Bengaluru: The first talaq case was registered in Bengaluru after the fast-track triple talaq was banned.

2010 లో సమీరుల్లా రెహమత్, ఆమె కుటుంబ సభ్యులు ఇద్దరి పెళ్లి జరిపించారు. పెళ్లి సమయంలో రూ. 7.50 లక్షల విలువైన కారు, రూ. 10 లక్షలు కట్నం కింద సమీరుల్లా రెహమత్ కు ఇచ్చారని సమాచారం. సమీరుల్లా రెహమత్ దంపతులకు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు.

భారీ వానకు కరెంట్ కట్, ఫోన్ చేసి పిలిస్తే కామంతో రెచ్చిపోయిన ఎలక్ట్రీషియన్, జైల్లో!భారీ వానకు కరెంట్ కట్, ఫోన్ చేసి పిలిస్తే కామంతో రెచ్చిపోయిన ఎలక్ట్రీషియన్, జైల్లో!

ఒక సంవత్సరం క్రితం దంపతుల మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో ఇరు కుటుంబ సభ్యులు, మతపెద్దలు ఇద్దరికి నచ్చచెప్పి బుధ్దిమాటలు చెప్పారు. తరువాత సమీరుల్లా రెహమత్ కు అదనంగా మరో రూ. 7 లక్షలు కట్నం ఇచ్చారు. భార్యను బీటీఎం లేఔట్ ప్రత్యేకంగా ఇల్లు తీసుకుని సమీరుల్లా రెహమత్ నివాసం ఉంటున్నాడు.

అయితే సమీరుల్లా రెహమత్ బీటీఎం లేఔట్ లోని భార్య ఇంటికి వెళ్లడం లేదు. ఇటీవల ఒక రోజు నేరుగా భార్య ఇంటికి వెళ్లిన సమీరుల్లా రెహమత్ తలాక్ తలాక్ తలాక్ అంటూ మూడు సార్లు భార్యకు చెప్పి నీకు విడాకులు ఇస్తున్నానని, నీకు దిక్కున్నచోట చెప్పుకో అని వెళ్లిపోయాడు. తాను ఎంత చెప్పినా తన భర్త సమీరుల్లా రెహమత్ వినడం లేదని, అనవసరంగా విడాకులు ఇచ్చాడని అతని భార్య ఫిర్యాదు చేశారని, కేసు విచారణలో ఉందని సుందగుంటపాళ్య పోలీసులు తెలిపారు.

English summary
Bengaluru: The first talaq case was registered in Bengaluru after the fast-track triple talaq was banned.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X