వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిట్‌కాయిన్ ఇన్వెస్టర్లకు రూ 42 లక్షలు టోకరా: టెక్కీ అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

పూణే: బిట్ కాయిన్ ఇన్వెస్టర్లను మోసం చేసిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీరును పోలీసులు అరెస్టు చేశారు. క్రిప్టోకరెన్సీ మోసాలకు సంబంధించిన మొదటి కేసు మహారాష్ట్రలో బహుశా ఇదే. మంగళవారంనాడు టెక్కీని అరెస్టు చేశారు.

బిట్ కాయిన్స్‌లోనూ, ఇతర క్రిప్టోకరెన్సీల్లోనూ పెట్టుబడులు పెట్ిటన వ్యక్తులను ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని మోసం చేశాడనే ఆరోపణలు వచ్చాయి. వారి పెట్టుబడి డబ్బులను గానీ, లాభాలను గానీ అతను ఇవ్వలేదు.

టెక్కీపై నాలుగు కేసులు...

టెక్కీపై నాలుగు కేసులు...

ప్రజలను 42 లక్షల రూపాయల మేర మేసం చేసినందుకు టెక్కీపై పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. 2017 ఆగస్టు నుంచి టెక్కీ తనను 13 లక్షల రూపాయల మేర మోసం చేశాడని పూణే - సతారా రోడ్డులోని 46 ఏళ్ల మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.

టెక్కీని అరెస్టు చేసినట్లు...

టెక్కీని అరెస్టు చేసినట్లు...

సతారా రోడ్డులో నివసించే ఆకాశ్ కంతిలాల్ సంచేటి అనే 27 ఏళ్ల టెక్కీని పోలీసులు అరెస్టు చేశారని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. సదాశివ పేటలో సంచేటి చిన్నపాటి సాఫ్ట్‌వేర్ కంపెనీ నడుపుతున్నాడు. గత రెండు రోజుల్లో పోలీసులకు మరో నాలుగు పిర్యాదులు అందాయి.

అతను తనను కలిసి...

అతను తనను కలిసి...

సంచేటి తనను 2017 ఆగస్టులో కలిసి బిట్‌కాయిన్స్‌లోనూ ఇతర వర్చువల్ కెన్సీల్లోనూ పెట్టుబడులు పెడితే మంచి లాభాలు ఇస్తానని హామీ ఇచ్చినట్లు మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. నాలుగు నెలల్లో ఆన్‌లైన్ ద్వారా ఆమె 13 లక్షల రూపాయలను ఆ టెక్కీ ఖాతాలోకి బదిలీ చేసింది. అయితే, తాను పెట్టుబడిన మొత్తాన్ని గానీ, లాభాలను గానీ అతను తనకు ఇవ్వలేదని ఆమె ఫిర్యాదు చేసింది.

అదిలా జరిగింది.

అదిలా జరిగింది.

బిట్ కాయిన్స్‌లో మహిళ పెట్టుబడి పెట్టడం ప్రారంభించినప్పుడు పుంజుకుంటూ వచ్చిందని, ఆ తర్వాత బిట్‌కాయిన్ విలువ తగ్గిపోయి నష్టాలు వచ్చాయని, దీంతో ంసచేటి డబ్బులను ఇతర వర్చువల్ కరెన్సీలకి బదిలీ చేయడానికి ప్రయత్నించాడని, వాటిలో కూడా నష్టాలు వచ్చాయని పోలీసులు అంటున్నారు.

English summary
Police arrested the proprietor of a software company for duping several persons by investing their money in bitcoins and other cryptocurrencies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X