వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నెట్లో మాజీ ప్రియురాలిపై అసభ్య మెసేజ్‌లు: టెక్కీ అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Techie held for sending lewd mails
హౌరా: మాజీ గర్ల్ ఫ్రెండ్ ఫోటోను అసభ్యకర సందేశాలతో ఇతర స్నేహితులకు ఫేక్ ఐడి ద్వారా పంపించిన ఓ టెక్కీని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన హౌరాలో జరిగింది. బిస్వా రాయ్ అనే ఇరవై ఏడేళ్ల వ్యక్తిని పోలీసులు ఆదివారం రాత్రి హౌరాలోని తన ఇంట్లో అరెస్టు చేశారు. సోమవారం ఉదయం కోర్టులో ప్రవేశ పెట్టారు. కోర్టు అతనికి రిమాండ్ విధించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బేలూరుకు చెందిన ఓ ఫెలో ఇంజనీర్‌తో బిస్వాకు మూడేళ్ల పాటు ఎఫైర్ నడిచింది. ఆమె ఓ ఐటి కంపెనీలో పని చేస్తోంది. ఏడాది క్రితం వారి మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. అప్పటి నుండి బిస్వా ఆమెతో సంబంధం కొనసాగించేందుకు ప్రయత్నాలు చేశాడు. ఆమె మాత్రం నిరాకరించింది.

దీంతో ఆమె పైన కక్ష తీర్చుకోవాలనుకున్నాడు. బిస్వా మొదట ఆమె ఫేస్‌బుక్ అకౌంట్‌ను హ్యాక్ చేశాడు. ఆమె స్నేహితులతో సంభాషించాడు. అసభ్యకర సందేశాలు పంపించాడు. ఆ తర్వాత ఆమె పేరు మీద ఓ ఫేక్ ఈమెయిల్ ఐడిని సృష్టించాడు. దాని ద్వారా ఆమె ఫోటోలు, అసభ్యకర సందేశాలు పంపించడం ప్రారంభించాడని పోలీసులు తెలిపారు.

ఈ విషయం తెలిసిన ఆ యువతి బేలూరు పోలీసులను ఆశ్రయించింది. ఆమె తన ఫిర్యాదులో ఎవరి పేరును పేర్కొనలేదు. ఆమె జూన్ నెలలో ఫిర్యాదు చేసింది. ఎవరు కారకులో తెలియక పోవడంతో ఆమె ఎవరి పైన అనుమానం వ్యక్తం చేయలేదు. ఫిర్యాదు మాత్రం చేసింది. పోలీసులు విచారణ జరిపి బిస్వాను అరెస్టు చేశారు.

English summary
An engineer employed was arrested from his home in Howrah's Salkia on Sunday night on charges of defaming his former girlfriend by allegedly circulating pornographic material to her friends and colleagues from a fake email account he opened in her name.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X