• search

వాకింగ్ వెళ్లిన టెక్కీ మాయం, భార్యకు హిందీలో చివరి మెసేజ్: 20 అయినా ఆచూకి శూన్యం !

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    బెంగళూరు: వాకింగ్ వెళ్లి వస్తానని ఇంటి నుంచి బయటకు వెళ్లి న సాఫ్ట్ వేర్ ఇంజనీరు 20 రోజులు అయినా తిరిగి రాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. లండన్ లోని ప్రసిద్ది చెందిన కంపెనీలో ఉద్యోగం చేసి బెంగళూరు వచ్చి మరో కంపెనీలో ఉద్యోగం చేస్తున్న టెక్కీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.

    బెంగళూరులోని పద్మనాభనగర్ లో నివాసం ఉంటున్న ప్రసన్న రామచంద్ర (39) లండన్ లోని కంపెనీలో ఉద్యోగం చేసి బెంగళూరు వచ్చాడు. అనంతరం బెంగళూరు చేరుకున్న ప్రసన్న రామచంద్ర ప్రసిద్ది చెందిన కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నంబర్ 9 తేది సాయంత్రం వాకింగ్ కు వెళ్లి వస్తానని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.

    Techie missing mysteriously padmanabha nagar in Bengaluru

    రాత్రి 10 గంటలు అయినా ప్రసన్న రామయంద్ర ఇంటికి రాలేదు. ప్రసన్న రామచంద్ర కోసం అతని స్నేహితులు, బంధువులు, తెలిసిన వారి నుంచి ఆరా తీసినా ఎలాంటి సమాచారం లేదు. ప్రసన్న రామచంద్ర భార్య సోదరుడు ప్రమోద్ ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

    ప్రసన్న రామచంద్ర మాయం అయిన మరుసటి రోజు అతని మొబైల్ 73377 72412 నెంబర్ నుంచి అతని భార్య మొబైల్ కు ఓ మెసేజ్ వచ్చింది. మీ భర్త మా దగ్గర ఉన్నాడని, మరుసటి రోజు అతను మీతో మాట్లాడుతాడని హిందీలో మెసేజ్ పంపించారు. అయితే మరుసటి రోజు ప్రసన్న రామచంద్ర అతని భార్యతో మాట్లడలేదు.

    Techie missing mysteriously padmanabha nagar in Bengaluru

    ప్రసన్న రామచంద్ర మా దగ్గర ఉన్నాడని మెసేజ్ పంపించిన తరువాత ఎవ్వరూ ఫోన్ చెయ్యలేదని అతని కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రసన్న రామచంద్ర మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అతని కుటుంబ సభ్యులు మరింత ఆందోళన చెందుతున్నారు.

    ప్రసన్న రామచంద్రను ఎవరైనా కిడ్నాప్ చేశారా ? 20 రోజులకు పైగా అయినా అతను ఎక్కడ ఉన్నాడు ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. నవంబర్ 9వ తేదీ ప్రసన్న రామచంద్ర ఇంటి నుంచి బయటకు వెళ్లి తరువాత ఆ ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు.

    తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

    English summary
    Techie missing mysteriously in Bengaluru, help to trace the missing person. A person called Prasanna Ramachandra (39) went missing on 9th November when he had gone for evening walk. Surprisingly a message was received on his wife's mobile, that he is in custody of unknown.

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more