వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోరం: యువతిని రేప్ చేసి తలనరికేశారు, తండ్రి అరెస్ట్

|
Google Oneindia TeluguNews

Teenager Found Beheaded, Burnt In Meghalaya; Father Arrested
గారోహిల్స్: ఓ పదిహేనేళ్ల యువతిపై అత్యాచారం చేసిన దుండగులు, అత్యంత దారుణంగా ఆమె తలనరికేసి పరారయ్యారు. ఈ దారుణ ఘటన మేఘాలయ రాష్ట్రంలో చోటు చేసుకుంది. కాగా, బాధిత యువతి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె భర్తను అరెస్ట్ చేశారు. అంతకుముందు తన కూతురు(బాధిత యువతి) అదృశ్యమైందని ఆమె తండ్రి ఫిర్యాదు చేశాడు.

పోలీసుల కథనం ప్రకారం.. ఘటనా స్థలంలో యువతి మృతదేహం దుస్తులు లేకుండా పడి ఉంది. ఆమెను మొదట అత్యాచారం చేసిన తర్వాత తలనరికి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, తన భర్తే ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడి హత్య చేశాడని ఆరోపిస్తూ బాధిత యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అంతకుముందు తన కూతురు అదృశ్యమైందని బాధితురాలి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. తన కూతురు అనారోగ్యంగా ఉండటంతో ఆమెను విలియంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లానని చెప్పాడు. ఆ తర్వాత తనకు అక్కడ పని ఉండటంతో ఓ ఆటోలో ఆమెను ఇంటికి పంపించానని తెలిపాడు.

అయితే తను ఇంటికి వచ్చినప్పటికీ తన కూతురు రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించానని అతడు తెలిపాడు. అయితే తన భర్తే కూతురు మరణానికి కారణమని బాధిత యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, బాధితురాలి తండ్రిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.

English summary
A 15-year-old girl who had been missing for over a week in Meghalaya, was found dead in a jungle on Sunday night, beheaded and burnt. Her father has been arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X