వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిక్‌టాక్ పిచ్చి : బ్రిడ్జిపైకి ఎక్కి.. నదిలోకి దూకి..

|
Google Oneindia TeluguNews

గోరఖ్‌పూర్ : షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్ పిచ్చి రోజు రోజుకూ ముదురుతోంది. తమిళనాడులో డేంజరస్ స్టంట్ చేస్తూ మెడ విరగ్గొట్టుకుని ఓ యువకుడు మృతి చెందిన ఘటన మరువకముందే యూపీలో ఇద్దరు టీనేజర్లు ఇలాంటి సాహసానికి ఒడిగట్టారు. టిక్‌టాక్ వీడియో చేస్తూ నదిలోకి దూకి ఒకరు ప్రాణాలు కోల్పోగా.. స్థానికుల సాయంతో మరొకరు బతికి బట్టకట్టాడు.

థరూర్ వర్సెస్ టిక్‌టాక్ : ఆరోపణలు అసంబద్ధమని కౌంటర్థరూర్ వర్సెస్ టిక్‌టాక్ : ఆరోపణలు అసంబద్ధమని కౌంటర్

బ్రిడ్జిపై డేంజరస్ స్టంట్లు

బ్రిడ్జిపై డేంజరస్ స్టంట్లు

ఔరంగాబాద్‌కు చెందిన దానిష్ యూపీ దేవ్‌గఢ్ జిల్లాలోని బంధువుల ఇంటికి వచ్చాడు. అక్కడ ఆటో డ్రైవర్ అయిన ఆషిక్‌తో అతనికి స్నేహం ఏర్పడింది. తరచూ టిక్‌టాక్ వీడియోలు పోస్ట్ చేసే ఈ ఇద్దరు యువకులు సోమవారం సాయంత్రం చోటీ గండక్ నది వద్దకు వెళ్లారు. నదావర్ ఓవర్ బ్రిడ్జిపైకి చేరుకున్న దానిష్, ఆషిక్‌లు అప్పటికే అక్కడ స్టంట్లు చేస్తూ వీడియోలు చేస్తున్న కొందరు యువకులను పరిచయం అయ్యారు. వారితో కలిసి ఆ ఇద్దరూ కొన్ని టిక్ టాక్ వీడియోలు చేశారు.

బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకి

బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకి

కాసేపు సరదాగా గడిపిన దానిష్, ఆషిక్‌లు ఓ డేంజరస్ స్టంట్ చేసి టిక్‌టాక్‌లో పోస్ట్ చేసి ఫేమస్ అవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగా దానిష్ బ్రిడ్జి రెయిలింగ్‌ ఎక్కి ఒక్కసారిగా నదిలోకి దూకాడు. ఈ తంతంగాన్ని అంతవరకు వీడియో తీసిన ఆషిక్ కూడా ఆ వెంటనే బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకేశాడు. అయితే నదీ ప్రవాహం వేగానికి వారిద్దరు కొట్టుకుపోయారు. విషయం గ్రహించిన స్థానికులు వెంటనే దానిష్‌ను కాపాడారు. ప్రవాహ వేగానికి ఆషిక్ గల్లంతయ్యాడు.

ఇంకా దొరకని ఆషిక్ ఆచూకీ

ఇంకా దొరకని ఆషిక్ ఆచూకీ

ఇద్దరు యువకులు నదిలో కొట్టుకుపోతున్న విషయం తెలిసి పెద్ద ఎత్తున జనం అక్కడికి చేరుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. స్థానికులను అడిగి టిక్ టాక్ కోసం వీడియోలు చేస్తూ ఈ సాహసానికి పాల్పడ్డారని తెలుసుకున్నారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గల్లంతైన ఆషిక్ ఆచూకీ కోసం గజ ఈతగాళ్లను రంగంలోకి దింపారు.

English summary
Two teenagers jumped off a crowded bridge at a ghat in Uttar Pradesh’s Deoria district in a bid to pull off a dangerous stunt by shooting a video on their mobile phones to share on TikTok.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X