వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెహెల్కా లైంగిక దాడి: తేజ్‌పాల్ అరెస్టుకు బ్రేక్

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మహిళా జర్నలిస్టుపై లైగింక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న తెహల్కా ఎడిటర్ తరుణ్‌ తేజ్‌పాల్‌కు కాస్త ఊరట లభించింది. తేజ్‌పాల్‌కు కోర్టు ఈ రోజు (శుక్రవారం) మధ్యాహ్నం 2:30 గంటల వరకు ముందస్తు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. రూ.20 వేల వ్యక్తిగత పూచికత్తుపై కోర్టు మధ్యంతర బెయిల్‌ను జారీ చేసింది. బెయిల్ పిటిషన్‌పై మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత కోర్టులో విచారణ జరుగనుంది.

ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తరుణ్ తేజ్‌పాల్ శుక్రవారం ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత పానాజీలోని సెషన్స్ కోర్టు ముందు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేసినట్లు తరుణ్ తేజ్‌పాల్ తరఫు న్యాయవాది రౌనఖ్ రావు చెప్పారు.

Tarun Tejpal

కాగా, శుక్రవారం ఉదయం తరుణ్ తేజ్‌పాల్‌ను అదుపులోకి తీసుకోవడానికి గోవా పోలీసులు ఢిల్లీలోని ఆయన నివాసానికి వచ్చారు. అతను అక్కడ లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. తరుణ్ తేజ్‌పాల్ ఎక్కడ ఉన్నాడనే విషయం తనకు తెలియదని అతని భార్య పోలీసులకు చెప్పారు.

తరుణ్ తేజ్‌పాల్ ఎక్కడున్నాడనే విషయం తెలియడం లేదని గోవా పోలీసులు అన్నారు. శనివారం వరకు తనకు సమయం ఇవ్వాలని అంతకు ముందు తేజ్‌పాల్ చేసిన విజ్ఞప్తిని గోవా పోలీసులు తిరస్కరించి, అతని అరెస్టుకు మెజిస్ట్రేట్ నుంచి నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ పొందారు.

English summary
A few hours after Tehelka magazine's founder-editor Tarun Tejpal's residence was raided in Delhi, his lawyers moved the district sessions court in Panaji for anticipatory bail on Friday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X