వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరిహాసమే, లైంగిక దాడి కాదు: తరుణ్ తేజ్‌పాల్

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తాను లైంగిక దాడికి పాల్పడలేదని, పరిహాసం కోసం సరదాగా అలా చేశానని మహిళా జర్నలిస్టుపై దాడి కేసులో నిందితుడైన తెహెల్కా వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్‌పాల్ కోర్టుకు చెప్పుకున్నాడు. ముందస్తు బెయిల్ కోసం పటిషన్ దాఖలు చేసిన తరుణ్ తేజ్‌పాల్ ఆ విధంగా చెప్పాడు. మహిళా జర్నలిస్టుపై తాను లైంగిక దాడికి ప్రయత్నించలేదని చెప్పుకున్నాడు.

అయితే, గత వారం యువతికి క్షమాపణలు చెబుతూ పంపిన ఈ మెయిల్ వాదనకు ఇది భిన్నంగా ఉంది. తాను సిగ్గుమాలిన అభిప్రాయానికి వచ్చి లైంగిక అనుసంధానం కోసం రెండు సార్లు ప్రయత్నించినందుకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్లు ఆయన ఆ ఈ మెయిల్‌లో అన్నారు.

Tarun Tejpal

సంఘటనను తారుమారు చేయడానికి ప్రయత్నిస్తున్నారని మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌధురిపై విమర్శలు చేస్తూ మహిళా జర్నలిస్టు తన ఉద్యోగానికి సోమవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆమె రాజీనామాను యాజమాన్యం ఆమోదించింది.

తనపై ముందస్తు పథకం ప్రకారం కుట్ర చేశారని తేజ్‌పాల్ ఆరోపించారు. తాను బిజెపి నేతల ఆగ్రహానికి బాధితుడిగా మారానని, గోవాలో బిజెపి ప్రభుత్వం ఉందని, గతంలో తాము బిజెపి నాయకుల అవినీతిని బయటపెట్టినందుకు తనపై కుట్ర చేశారని తేజ్‌పాల్ అన్నారు.

English summary
Tarun Tejpal, the founder of Tehelka who has been accused of raping a younger colleague by the Goa Police, has said to court that the "encounter was only light-hearted bantering.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X