వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెహెల్కా కేసు: విక్టిమ్‌ని బెదిరించలేదన్న షోమా

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: లైంగిక దాడి కేసులో బాధిత మహిళా జర్నలిస్టుపై అభాండాలు వేసినట్లు, ఆమెను బెదిరించినట్లు, ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలను తెహెల్కా మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌదరి ఖండించారు. అదంతా విషప్రచారమని అన్నారు.

తాను ఆ విధమైన చర్యలకు పాల్పడినట్లు మీడియాలో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. తరుణ్ తేజ్‌పాల్ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపించిన మహిళా జర్నలిస్టు తన రాజీనామా లేఖలో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తేజ్‌పాల్, షోమా చౌదరి సంఘటనను కప్పిపుచ్చాలని చూస్తున్నారని, తనను బెదిరించే, తన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసే, తనపై అభాండాలు వేసే చర్యలకు దిగుతున్నారని ఆమె ఆరోపించారు.

Shoma Chaudhary

నవంబర్ 7వ తేదీ నుంచి జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఉద్యోగం కల్పించిన వ్యక్తిగా తరుణ్ తేజ్‌పాల్ మాత్రమే కాదు, ఉద్యోగులు, జర్నలిస్టులు, స్తీరవాదులు ఉమ్మడిగా మహిళల విషయంలో విఫలమయ్యారని ఆమె వ్యాఖ్యానించారు.

కాగా, తరుణ్ తేజ్‌పాల్‌పై గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరిక్కర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై కుట్ర చేశారంటూ తరుణ్ తేజ్‌పాల్ మాటల్లో ఏ మాత్రం నిజం లేదని, దాన్ని స్టింగ్ ఆపరేషన్ ద్వారా నిరూపించడానికి తరుణ్ తేజ్‌పాల్ పూనుకోవాలని ఆయన అన్నారు.

English summary
Tehelka Managing Editor Shoma Chaudhury on Wednesday rejected the charge of her being involved in "slander, intimidation or character assassination" of the victim of the alleged sexual assault by the magazine's Editor Tarun Tejpal and termed it a "malicious campaign".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X