వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెహెల్కా కేసు: తరుణ్ తేజ్‌పాల్‌పై రేప్ అభియోగం

By Pratap
|
Google Oneindia TeluguNews

పానాజీ: మహిళా ఉద్యోగినిపై అత్యాచారం చేశాడని తెహెల్కా మాజీ చీఫ్ తరుణ్ తేజ్‌పాల్‌పై గోవా పోలీసులు అభియోగం మోపారు. సోమవారం ఈ మేరకు వారు చార్జిషీట్ దాఖలు చేశారు. ఆయనపై నిరుడు నవంబర్ 22వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదైంది.

గోవాలోని హోటల్ లిఫ్ట్‌లో మహిళా ఉద్యోగిపై తరుణ్ తేజ్‌పాల్ అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. 2013 నవంబర్‌లో తెహెల్కా థింక్ ఫెస్ట్ కార్యక్రమం సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

Tarun Tejpal

తేజ్‌పాల్‌పై దాఖలు చేసిన చార్జిషీట్ 2,846 పేజీలు ఉంది. అందులో 132 పేజీలు ప్రధాన చార్జిషీట్ కాగా, 30 పేజీలు సాక్షులకు సంబంధించినవి. అనుబంధాలతో కలిపి మొత్తం 2,846 పేజీల చార్జిషీట్‌ను పోలీసులు దాఖలు చేశారు.

పోలీసులు 152 మంది సాక్షు వాంగ్మూలాలను నమోదు చేశారు. వారిలో దర్యాప్తు అధికారి సునీత సావంత్ వాంగ్మూలం కూడా ఉంది. బాధితురాలు అత్యాచారానికి, లైంగిక వేధింపులకు గురైందని, హోటల్‌లోని లిఫ్ట్‌లో ఆమె గౌరవానికి భంగం వాటిల్లిందని నిరూపించడానికి తమ వద్ద తగిన ఆధారాలున్నాయని పోలీసులు చార్జిషీట్‌లో తెలిపారు.

English summary

 A chargesheet in the sexual assault case allegedly involving Tehelka founder editor Tarun Tejpal was submitted by the crime branch of Goa Police on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X