వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిస్ యూ పప్పా..! తండ్రిని గుర్తు చేసుకుని ఉద్వేగానికిలోనైన తేజ్ ప్రతాప్

|
Google Oneindia TeluguNews

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్నికల ప్రచారంలో తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో తండ్రిని గుర్తు చేసుకుని ఉద్వేగానికి గురయ్యారు. బీహార్‌లో కాంగ్రెస్, ఆర్జేడీ ఇతర పార్టీలతో కలిసి మహాకూమిగా ఏర్పడి పోటీస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురవారం రాహుల్ గాంధీ తమ అభ్యర్థి శతృఘ్ను సిన్హాతో కలిసి పాటలీపుత్రలో ప్రచారం నిర్వహించారు. ఈ సభకు ఆర్జేడీ తరఫున తేజస్వీ, తేజ్ ప్రతాప్‌లు హాజరయ్యారు.

జాతిపితను కించపరిచిన సాధ్విని క్షమించే ప్రసక్తే లేదు: తొలిసారి నోరువిప్పిన మోడీజాతిపితను కించపరిచిన సాధ్విని క్షమించే ప్రసక్తే లేదు: తొలిసారి నోరువిప్పిన మోడీ

పాటలీపుత్ర సభలో లాలూ పెద్దకొడుకు తేజ్ ప్రతాప్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆయన.. తండ్రిని గుర్తు చేసుకున్నారు. లాలూ తన వెంట లేనందునే మాట్లాడే అవకాశం దొరకలేదని ఉద్వేగానికి లోనయ్యారు. మిస్ యూ పప్పా అంటూ కన్నీళ్లు కారుస్తున్న ఎమోజీలను జతచేసి ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

Tej Pratap tweets Miss you papa, after not given chance to speak at Rahuls rally

తేజస్వీ ట్వీట్ వైరల్‌గా మారడంతో మీడియా ఈ విషయాన్ని తేజ్ ప్రతాప్ సోదరుడు తేజస్వీని ప్రశ్నించారు. అయితే ఈ విషయం తనకు తెలియదని ఆయన సమాధానం ఇచ్చారు. బహుశా సమయం లేకపోవడం వల్ల తన అన్నకు మాట్లాడే అవకాశం వచ్చి ఉండకపోవచ్చని అన్నారు.

లాలూ కుమారులైన తేజ్ ప్రతాప్, తేజస్విల మధ్య విబేధాలు వచ్చాయని గతంలో వార్తలు వచ్చాయి. ఇటీవలే తేజ్ ప్రతాప్ ఆర్జేడీ స్టూడెంట్ వింగ్ నుంచి వైదొలగడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. ఈ మధ్యకాలంలో తేజ్ ప్రతాప్ లాలూ - రబ్రీ మోర్చా పేరుతో సొంత పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. అయితే ఎన్నికల ప్రచారంలో అన్నదమ్ములిద్దరూ పాల్గొనడంతో వారి మధ్య విబేధాలు సమసిపోయాయని అంతా అనుకున్నారు. అయితే తాజాగా తేజ్ ప్రతాప్ చేసిన ట్వీట్ ఆయన తనకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడంలేదన్న అసంతృప్తితో ఉన్నారన్న విషయాన్ని మరోసారి బహిర్గతం చేసింది.

English summary
JD chief Lalu Prasad's elder son Tej Pratap posted an emotional message for his father after he accused the Congress of not giving him a chance to speak at a rally in Bihar's Pataliputra on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X