వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లూలూ కుటుంబంలో లుకలుకలు: భార్యతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన తేజ్ ప్రతాప్ యాదవ్

|
Google Oneindia TeluguNews

బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. ఆరు నెలల క్రితమే లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మరో ఆర్జేడీ నేత కుమార్తెతో వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఎంత ఘనంగా ఆ వివాహం జరిగిందో అంతే ఘనంగా ఇద్దరూ విడిపోయేందుకు సిద్ధపడ్డారు. ఈ క్రమంలోనే పాట్నా కోర్టులో విడాకులు మంజూరు చేయాల్సిందిగా తేజ్ ప్రతాప్ యాదవ్ పిటిషన్ దాఖలు చేశారు.

పెళ్లయిన ఆరునెలలకే విడాకులా..?

పెళ్లయిన ఆరునెలలకే విడాకులా..?

బీహార్ ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్లయిన ఆరునెలలకే భార్య ఐశ్వర్యతో విడిపోయేందుకు సిద్ధపడ్డారు. ఇందులో భాగంగానే పాట్నా సివిల్ కోర్టులో విడాకులు మంజూరు చేయాల్సిందిగా పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఇదే విషయమై చర్చించేందుకు తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ శిక్ష అనుభవిస్తున్న రాంచీ జైలుకు తేజ్‌ప్రతాప్ యాదవ్ వెళ్లారు. శుక్రవారం రాత్రి గయాలో బస చేసిన తేజ్‌ప్రతాప్ శనివారం తండ్రిని కలిసేందుకు రాంచీ జైలుకు వెళ్లారు. నిజానికి తండ్రిని శుక్రవారమే కలవాల్సి ఉండగా...తల్లి రబ్రీదేవీతో పాటు కొందరు కుటుంబ సభ్యులు వారించడంతో విమానాశ్రయం నుంచి వెనుదిరిగారు.

ఇదిలా ఉంటే తేజ్‌ప్రతాప్ యాదవ్ విడాకుల కేసు నవంబర్ 29న విచారణకు రానున్నట్లు ఆయన తరపున లాయర్ యశ్వంత్ కుమార్ శర్మ తెలిపారు. తనకు ఏమీ తెలియదని కేవలం దంపతులు కలిసి ఉండలేమని విడాకులు ఇప్పించాల్సిందిగా తనకు చెప్పినట్లు లాయర్ యశ్వంత్ కుమార్ శర్మ చెప్పారు. ఇక ఇంతకు మించి తాను ఏమి చెప్పలేనని లాయర్ వెల్లడించారు.

అసలు సమస్య ఎక్కడ వచ్చింది..?

అసలు సమస్య ఎక్కడ వచ్చింది..?


తేజ్‌ప్రతాప్ యాదవ్ , ఐశ్వర్యరాయ్‌ల వివాహం ఈ ఏడాది మే 12న ఘనంగా జరిగింది. ఐశ్వర్యరాయ్‌ది కూడా రాజకీయ కుటుంబమే కావడం విశేషం. ఐశ్వర్యరాయ్ ఆర్జేడీ నేత చంద్రికా రాయ్ కుమార్తె. ఆమె తాత దరోగా ప్రసాద్ రాయ్ బీహార్ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక ఐశ్వర్యది కూడా రాజకీయ కుటుంబం కావడంతో ఆమె కూడా రాజకీయాల్లోకి రావాలని భావించారు. ఈ నిర్ణయమే తేజ్ ప్రతాప్ ఐశ్వర్యల పచ్చని కాపురంలో చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఐశ్వర్య 219 లోక్‌సభ ఎన్నికల్లో శరన్ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతారనే వార్త కూడా జోరుగా ప్రచారం చేస్తోంది. ఆమె రాజకీయాల్లోకి రావడం తేజ్‌ప్రతాప్ యాదవ్‌కు ఇష్టం లేదని కొందరు సన్నిహితులు చెబుతున్నారు.

 తమ్ముడు తేజస్వీ యాదవ్‌తో విబేధాలు

తమ్ముడు తేజస్వీ యాదవ్‌తో విబేధాలు

తేజ్ ప్రతాప్ యాదవ్ ఐశ్వర్యల వివాహం అదరహో అన్నట్లుగా జరిగింది. ఈ వివాహానికి 10వేల మందికి పైగా అతిథులు వచ్చారు. ఈ వివాహం ఎంత ఘనంగా జరిగిందని పేరు వచ్చిందో.. అంతే ఘనంగా అపకీర్తి కూడా మూటగట్టుకుంది. వివాహంలో చాలామంది ఆర్జేడీ నేతలు ఆహారాన్ని, అత్యంత విలువైన డెకరేషన్ వస్తువులను దొంగలించినట్లు వార్తలు వచ్చాయి. ఇక తేజ్ ప్రతాప్ యాదవ్‌తో వివాహం అనంతరం అతని తమ్ముడు తేజస్వీ యాదవ్‌తో విబేధాలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. కొన్ని సందర్భాల్లో పార్టీ నాయకులు తనను పట్టించుకోవడం లేదని తేజ్‌ప్రతాప్ యాదవ్ బాహాటంగానే ప్రకటించారు కూడా. ఇలా చెబుతూనే తన సోదరుడికి తనకు ఎలాంటి విబేధాలు లేవని తన తమ్ముడు తన హృదయానికి దగ్గరగా ఉంటారని చెప్పారు. తేజస్వీ యాదవ్ కూడా తన అన్నే తనకు మార్గదర్శకుడని తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని స్పష్టం చేశారు.

English summary
A day after filing his divorce petition, RJD chief Lalu Prasad's elder son Tej Pratap Yadav is set to meet his father in Ranchi on Saturday. Former Union railway minister's son had approached a civil court in Patna on Friday, seeking divorce from his wife Aishwarya Rai just six months after the wedding.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X