వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్జేడీలో వారసత్వ పోరు : పార్టీ యూత్ వింగ్ పదవికి తేజస్వియాదవ్ రాజీనామా

|
Google Oneindia TeluguNews

బీహార్ : లోక్‌సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బీహార్‌లో ఆర్జేడీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఆర్జేడీ యూత్ వింగ్ మెంటార్‌ పదవికి రాజీనామా చేశారు. గత కొద్దిరోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న తేజ్‌ప్రతాప్ యాదవ్ తాను ఆర్జేడీ యూత్ వింగ్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ట్విటర్ ద్వారా తెలిపారు.

ఎవరిని ఉద్దేశించి తేజ్ ప్రతాప్ ట్వీట్ చేశారు..?

తనను ఎవరైతే రాజకీయాల్లో పరిపక్వత లేదని విమర్శిస్తున్నారో వారికే అసలు పరిపక్వత లేదని అన్నారు. త్వరలోనే అది వారికి తెలిసొస్తుందనే కామెంట్స్ చేశారు తేజ్ ప్రతాప్ యాదవ్. అయితే ఫలానా వ్యక్తిని టార్గెట్ చేస్తున్నట్లు ఎక్కడా చిన్న పాటి క్లూ కూడా ఇవ్వకుండా తాను చెప్పాల్సింది చెప్పేశారు లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్. ఇదిలా ఉంటే తన సోదరుడు ఆర్జేడీ ఛీఫ్ తేజస్వీ యాదవ్‌ను ఉద్దేశించే ఈ ట్వీట్లు పెట్టినట్లు తెలుస్తోంది.

ఇద్దరికీ ఎక్కడ చెడింది..?

ఇద్దరికీ ఎక్కడ చెడింది..?

లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు పరిమితం అయ్యాక ఈ అన్నదమ్ముల మధ్య రాజకీయంగా విబేధాలు బయటపడ్డాయి. లాలూకు అసలైన రాజకీయ వారసుడిగా తేజస్వీయాదవ్ తెరపైకొచ్చారు. అంతేకాదు తనకు ప్రజల్లో అదే స్థాయి ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే ఇదే విషయంలో తేజ్‌ప్రతాప్ అలక బూనినట్లు సమాచారం. అయితే వారిద్దరి మధ్య ఎలాంటి విబేధాలు లేవని చెబుతూ ఈ ఏడాది జనవరిలో తేజ్ ప్రతాప్ ఓ ఫోటోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో తేజస్వీ యాదవ్ తేజ్ ప్రతాప్ పాదాలకు నమస్కరిస్తున్నట్లు ఉంది.

కాంగ్రెస్‌లో చేరిన రెండో రోజే మోడీపై బాలీవుడ్ నటి ఊర్మిళా ఘాటు విమర్శలు కాంగ్రెస్‌లో చేరిన రెండో రోజే మోడీపై బాలీవుడ్ నటి ఊర్మిళా ఘాటు విమర్శలు

పైళ్లయిన ఐదునెలలకే విడాకుల కోసం దరఖాస్తు

పైళ్లయిన ఐదునెలలకే విడాకుల కోసం దరఖాస్తు

జేడీయూతో సఖ్యత ఉన్న సమయంలో సంకీర్ణ ప్రభుత్వంలో తేజ్ ప్రతాప్ యాదవ్ మంత్రిగా పనిచేశారు. ఈ మధ్యే తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి వార్తల్లో నిలిచారు. పెళ్లైన ఐదునెలలకే భార్య ఐశ్వర్యతో విడిపోవాలని భావించి విడాకులు కోసం దరఖాస్తు కూడాపెట్టుకున్నారు. ఆ సమయంలోనే తనకు మద్దతుగా నిలవకుండా తన కుటుంబం ఐశ్వర్యకు మద్దతుగా నిలవడాన్ని తేజ్ ప్రతాప్ జీర్ణించుకోలేకపోయారు. మొత్తానికి ఆర్జేడీలో తేజ్ ప్రతాప్ యాదవ్ రాజీనామా ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో కాలమే సమాధానం చెప్పాలి.

English summary
Just ahead of Lok Sabha elections, Tej Pratap Yadav, the elder son of Lalu Prasad Yadav, has announced his resignation as the mentor of the RJD’s youth wing. Taking to Twitter, Yadav, who has been away from politics for a while, said, “I am resigning as the of RJD’s youth wing.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X