వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్యాబినెట్ అని రాయరాదు కానీ.. 30 వేల కోట్ల తేజస్వీ ఆరోపణలపై కేంద్రమంత్రి అశ్విన్ చౌబే..

|
Google Oneindia TeluguNews

బీహర్ ప్రచార పర్వం రంజు మీద ఉంది. నితీశ్ కుమార్ హయాంలో 30 వేల కోట్ల ప్రజాధనం దోపిడీకి గురైందని తేజస్వీ యాదవ్ కామెంట్ చేయడంతో అగ్గిరాజేసింది. దీనిపై కేంద్రమంత్రి అశ్విని చౌబే స్పందించారు. తేజస్వి లక్ష్యంగా విమర్శలు చేశారు. గత హయాంలో 60 స్కాములు చేశారని తేజస్వీ ఆరోపించగా.. చౌబే రియాక్టయ్యారు.

కశ్మీర్ యువతులు, ఇద్దరు బీహర్ యువకులు.. పెళ్లిచేసుకున్నారు.. కట్ చేస్తే పోలీసు స్టేషన్‌లో....కశ్మీర్ యువతులు, ఇద్దరు బీహర్ యువకులు.. పెళ్లిచేసుకున్నారు.. కట్ చేస్తే పోలీసు స్టేషన్‌లో....

క్యాబినెట్ అని రాయరాదు కానీ..

క్యాబినెట్ అని రాయరాదు కానీ..

తేజస్వీ యాదవ్‌కు క్యాబినెట్ అని కూడా సరిగా రాయరాదని చౌబే ఆరోపించారు. ఒక విషయాన్ని ఆయన సరిగా అర్థం చేసుకోలేరని ధ్వజమెత్తారు. పదో తరగతి కూడా పాస్ కాలేదని విరుచుకుడ్డారు. కానీ సీఎం నితీశ్ కుమార్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ఆయన క్వాలిఫైడ్ ఇంజినీర్ అని.. మంచి, చెడు తెలుసు అని పేర్కొన్నారు. కానీ తేజస్వీ మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని తెలిపారు. తేజస్వీ తండ్రి లక్ష ఉద్యోగాలు ఇస్తానని మంత్రివర్గ సమావేశంలో చెప్పారు.. కానీ అభ్యర్థుల నుంచి తేజస్వీ యాదవ్ డబ్బులు వసూల్ చేశారని ఆరోపించారు. కానీ వారి అప్లికేషన్ ఫామ్ మాత్రం ఇంకా డస్ట్ బిన్‌లోనే ఉన్నాయని చెప్పారు.

భారీగా అవినీతి..

భారీగా అవినీతి..

గత ఐదేళ్లలో నితీశ్ సర్కార్ అవినీతి చేసిందని తేజస్వీ ఆరోపించిన సంగతి తెలిసిందే. పశుదాణా, మరుగుదొడ్ల నిర్మాణం, విద్యార్థుల స్కాలర్ షిప్ పేరుతో దోచుకున్నారని ఆరోపించారు. తొలుత ఆర్జేడీ కలిసి ప్రభుత్వంలో ఉండగా.. తర్వాత 33 నెలలు మాత్రం బీజేపీతో కలిసి జేడీయూ అధికారం చేపట్టింది. 33 నెలలు బీజేపీతో కలిసి నితీశ్ రాష్ట్రాన్ని పాలించారని తేజస్వీ యాదవ్ విమర్శించగా.. కేంద్రమంత్రి అశ్విని చౌబే అదేవిధంగా స్పందించారు.

 మరో రెండు విడతలు

మరో రెండు విడతలు

బీహర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, సీపీఐ, సీపీఎం కూటమి.. ఆర్జేడీ, బీజేపీ ఇతర పక్షాలు కలిసి పోటీనిస్తున్నాయి. ఎల్జేపీ మాత్రం ఒంటరిగా బరిలోకి దిగింది. ఈ నెల 28వ తేదీన తొలి విడత 71 స్థానాలకు పోలింగ్ జరిగింది. నవంబర్ 3వ తేదీన రెండో విడత పోలింగ్.. 7వ తేదీన మూడో విడత పోలింగ్ జరగనుంది. 10వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతారు. ఉదయం 11 గంటల వరకు ట్రెండ్ తెలిసిపోనుంది.

English summary
Union Minister Ashwini Choubey took a dig at RJD leader Tejashwi Yadav over a spelling mistake.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X