వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2035లో ఆర్జేడీదే కేంద్రంలో అధికారం.. కానీ, 15 ఏళ్లలో జరిగిన తప్పులపై తేజస్వి యాదవ్ సారీ...

|
Google Oneindia TeluguNews

ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 15 ఏళ్ల లాలూ-రబ్రీ హయాంలో తప్పు చేస్తే క్షమించాలని కోరారు. ఆయన ఇదివరకు కూడా ఇదేవిధంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. ఆర్జేడీ 24వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి తేజస్వి యాదవ్ మాట్లాడారు. తన తల్లి, తండ్రి అధికారంలో తప్పు చేసి ఉంటే మన్నించాలని కోరారు.

తప్పు జరిగి ఉండొచ్చు..

తప్పు జరిగి ఉండొచ్చు..

లాలూ ప్రసాద్ యాదవ్-రబ్రీదేవీ ముఖ్యమంత్రులుగా పనిచేసిన సమయంలో తప్పు జరిగి ఉండొచ్చు. కానీ తాను అప్పుడు అధికారంలో లేనన్నారు తేజస్వి యాదవ్. అయితే పార్టీ తరఫున ఏదైనా పొరపాటు జరిగితే దయచేసి మన్నించండి అని కోరారు. ఒకవేళ తప్పుచేసినా క్షమాపణ అడిగే ధైర్యం ఉండాలని కోరారు. గతంలో జరిగిన పొరపాట్లు తమను వెంటాడుతున్నాయని.. 15 ఏళ్ల పాటు తమ పార్టీ అధికారానికి దూరమయ్యిందని చెప్పారు.

పూర్వ వైభవం, కేంద్రంలో అధికారం

పూర్వ వైభవం, కేంద్రంలో అధికారం


పార్టీ శ్రేణులు, నేతలు కష్టపడి శ్రమిస్తే తిరిగి ఆర్జేడీకి పూర్వవైభవం వస్తుందని తేజస్వి యాదవ్ తెలిపారు. పార్టీ క్యాడర్ అవిశ్రాంతంగా శ్రమిస్తే రాష్ట్రంలో పార్టీ మళ్లీ అధికారం చేపడుతుందని కామెంట్ చేశారు. అంతేకాదు 2035 వరకు కేంద్రంలో తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కానీ ఆ రోజు వరకు తమ పార్టీ నేతలు కాస్త ఓపికిగా ఉండాలని కోరారు. పార్టీలో విభేదాలు, వ్యక్తిగత అభిరుచులను పక్కన పెట్టాలని హితవు పలికారు. ఇలా అయితే ఢిల్లీ కోటపై ఆర్జేడీ జెండా ఎగురుతుందని చెప్పారు.

Recommended Video

Yuzvendra Chahal ట్రోల్స్ Rohit Sharma With A ఫన్నీ పోస్ట్
సారీ.. మరీ నితీశ్

సారీ.. మరీ నితీశ్

తమ ప్రభుత్వంలో జరిగిన తప్పులకు సంబంధించి తాను క్షమాపణ కోరానని తేజస్వి యాదవ్ తెలిపారు. అయితే బీహర్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా ప్రజలకు సారీ చెప్పాలన్నారు. ఆయన హయాంలో జరిగిన కుంభకోణాలకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రజలకు అపాలజీ చెప్పాలన్నారు. అంతేకాదు నితీశ్ కుమార్‌కు మన:సాక్షి లేదన్నారు. తమతో విడిపోయి.. బీజేపీతో చేతులు కలిపారని పేర్కొన్నారు. అతనికి మనసే లేదని మండిపడ్డారు.

English summary
RJD leader Tejashwi Yadav again apologised for the mistakes committed during the 15-year Lalu-Rabri regime in Bihar
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X