• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఇప్పటికే జీడీపీ ఢమాల్... ఇప్పుడు బెంగళూరును చంపుతున్నారు... తేజస్వి వ్యాఖ్యలపై రాజకీయ దుమారం...

|

ఉగ్రవాద కార్యకలాపాలకు బెంగళూరు కేంద్ర బిందువుగా మారిందన్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలు కర్ణాటకలో దుమారం రేపుతున్నాయి. బీజేవైఎం నూతన అధ్యక్షుడిగా ఎంపికైన మరుసటిరోజే తేజస్వి సూర్య ఇలాంటి కామెంట్స్ చేయడం గమనార్హం. తేజస్వి వ్యాఖ్యలు సిగ్గుచేటు అని... అతన్ని వెంటనే పార్టీ నుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి యడియూరప్ప మాత్రం తేజస్వి సూర్య వ్యాఖ్యలను బహిరంగంగానే సమర్థించారు. దీంతో బెంగళూరు నిజంగానే ఉగ్రవాద కార్యకలాపాలకు ఒక హబ్‌‌లా మారిందా అన్న చర్చ జరుగుతోంది.

సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత...

సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత...

తేజస్వి సూర్య వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అంతేకాదు,ఇప్పుడు అధికారంలో ఉన్నది మీ ప్రభుత్వమే(బీజేపీ) కదా అని గుర్తుచేస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చాకే బీజేపీ టెర్రర్ హబ్‌గా మారిందా అని తేజస్వి సూర్యను ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ బెంగళూరులో ఉగ్రవాద కార్యకలాపాలు నిజమే అయితే... కేంద్రంలో,రాష్ట్రంలో అధికార పార్టీ మీదే కాబట్టి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని నిలదీస్తున్నారు.

హి ఈజ్ కిల్లింగ్ బెంగళూరు... : కాంగ్రెస్

హి ఈజ్ కిల్లింగ్ బెంగళూరు... : కాంగ్రెస్

కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకె శివ కుమార్ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించారు. బీజేపీ తక్షణం ఆయన్ను పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తేజస్వి సూర్య తన వ్యాఖ్యలతో ఒకరకంగా బెంగళూరును చంపుతున్నాడని.. ఇది బీజేపీకి సిగ్గుచేటు అని మండిపడ్డారు. కేపీసీసీ చీఫ్ వేణు గోపాల్ కూడా తేజస్వి సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. టెక్నాలజీ,నూతన ఆవిష్కరణల విషయంలో గ్లోబల్ సిటీగా ప్రసిద్ది చెందిన బెంగళూరుపై తేజస్వి కామెంట్స్ తీవ్ర అభ్యంతరకరమని చెప్పారు.ఇప్పటికే జీడీపీ వృద్ది రేటు పడిపోయిందని... ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇక బెంగళూరులో కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు ముందుకొస్తారని ప్రశ్నించారు. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ,కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం చెప్పాలన్నారు.

బెంగళూరులో ఎన్ఐఏ కార్యాలయం

బెంగళూరులో ఎన్ఐఏ కార్యాలయం

మరోవైపు తేజస్వి సూర్య వ్యాఖ్యలను ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సమర్థించడం గమనార్హం. చాలాకాలంగా కర్ణాటకలో ఎన్ఐఏ కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరుతున్నానని... అది ఇప్పటికీ నెరవేరిందని అన్నారు. అందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతున్నట్లు తెలిపారు. ఇటీవలి కాలంలో బెంగళూరులో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోయాయని వ్యాఖ్యానించారు. అయితే బెంగళూరు ప్రతిష్టను దెబ్బతీసేలా కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర నష్టం చేస్తాయని కాంగ్రెస్ ఫైర్ అవుతోంది.

తేజస్వి సూర్య కామెంట్స్...

తేజస్వి సూర్య కామెంట్స్...

ఇటీవల బెంగళూరులో ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలు పెరిగిపోతున్నందున పూర్తి స్థాయి సిబ్బందితో ఇక్కడ ఎన్ఐఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరినట్లు ఆదివారం(సెప్టెంబర్ 27) తేజస్వి సూర్య వెల్లడించారు. రెండు రోజుల క్రితం అమిత్ షా నివాసంలో ఆయన్ను కలుసుకుని ఈ విషయం చెప్పినట్లు తెలిపారు. ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరు గత కొద్దిరోజులుగా ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారిందని ఆరోపించారు. ఇటీవల జరిగిన పలు అరెస్టులు,సీప్లర్ సెల్స్ కార్యకలాపాలను బట్టబయలు చేయడం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోందన్నారు. ఆగస్టులో చోటు చేసుకున్న డీజే హళ్లి, కేజే హళ్లి అల్లర్లతో బెంగళూరులో ఎన్నో ఉగ్రవాద సంస్థలు తిష్ట వేశాయన్న సంకేతాలను పంపించాయన్నారు. తేజస్వి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతుండటంతో మున్ముందు దీనిపై మరింత రచ్చ జరిగే అవకాశం ఉంది.

English summary
Bengaluru, a global city is known for Technology and Innovation, BJP MP terming it as an epicenter of terror is highly condemnable, said the opposition Congress on Monday. GDP growth has crashed and with such statements, which investor will come to Bengaluru & Karnataka? Will PM Narendra Modi and FM Nirmala Sitharaman answer?" KPCC Chief Shiva Kumar questioned.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X