వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంలో సూపర్ ఎమర్ఝెన్సీ, మమత మాటలను సమర్థించిన ఆర్ జెడి

బెంగాల్ ముఖ్యమంత్రి చేసిన సూపర్ ఎమర్జెన్సీ వ్యాఖ్యలను బీహర్ డిప్యూటీ ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ సమర్థించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

పాట్నా:పెద్ద నగదు నోట్ల రద్దుతో దేశంలో సూపర్ ఎమర్జెన్సీ విధించిన్టుగా ఉందన్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ వ్యాఖ్యలను బీహర్ డిప్యూటీ సిఎం తేజస్వి యాదవ్ సమర్థించారు.అయితే బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ మాత్రం పెద్ద నగదు నోట్ల రద్దును స్వాగతించారు.మరో వైపు నితీష్ పై ఆర్ జెడి అధినేత లాలూ కూడ పరోక్ష విమర్శలు గుప్పించాడు.

పెద్ద నగదునోట్ల రద్దు తర్వాత దేశంలో పరిస్థితులు మారిపోయాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలకు అడ్డుకట్ట పడడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

పెద్ద నగదు నోట్ల రద్దుపై విపక్షాల్లో ఐక్యత లేకుండా పోయింది. ఈ విషయమై ఎన్ డి ఏ వ్యతిరేక పక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు ఆశించిన మేరకు సక్సెస్ కాలేదు.

అయితే కొన్ని పార్టీలు కాంగ్రెస్ నిర్వహించిన సమావేశానికి గైరాజరయ్యాయి. ఈ సమావేశానికి బెంగాల్ ముఖ్యమంత్రి మమతబెనర్జీ హజరయ్యారు. వామపక్షాలు మాత్రం ఈ సమావేశానికి దూరంగా ఉన్నాయి.

కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఈ సమావేశానికి అన్నివిపక్షాలను ఆహ్వనించినప్పటికీ అన్ని పార్టీలు ఈ సమావేశానికి పలు కారణాలతో హజరుకాలేదు. డిఎంకె, ఆర్ జెడి, జెఎంఎం, ఐయూఎంఏల్, ఎఐయూడిఎప్ , జెడిఎస్ నేతలు పాల్గొన్నారు.

 తృణమూల్ అధినేత్రి వ్యాఖ్యలను సమర్థించిన బీహర్ డిప్యూటీ సిఎం

తృణమూల్ అధినేత్రి వ్యాఖ్యలను సమర్థించిన బీహర్ డిప్యూటీ సిఎం

పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ చేసిన వ్యాఖ్యలను బీహర్ డిప్యూటీ సిఎం తేజస్వీ యాదవ్ సమర్థించారు. పెద్ద నగదు నోట్ల రద్దుతో ప్రజల జీవనం అస్తవ్యస్తమైందని ఆయన ఆరోపించారు. బెంగాల్ ముఖ్యమంత్రి చెప్పినట్టుగా దేశంలో సూపర్ ఎమర్జెన్సీ కొనసాగుతోందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.ఎటిఎంలలో డబ్బులు అందుబాటులో లేవు. డబ్బుల కోసం ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. పేదలకు టెక్నాలజీ అందుబాటులో లేదన్నారు. పేదల కష్టాల గురించి ప్రధానమంత్రి మాట్లాడడం లేదన్నారు. అయితే బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాడు.బీహర్ లో ఆర్ జె డి నితీష్ కుమార్ ప్రభుత్వంలో భాగస్వామ్యంలో కొనసాగుతోంది.

 నితీష్ పై లాలూ పరోక్షంగా విమర్శలు గుప్పించినలాలూ

నితీష్ పై లాలూ పరోక్షంగా విమర్శలు గుప్పించినలాలూ

కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విపక్ష పార్టీల సమావేశానికి ఆర్ జెడి పార్టీ హజరైంది. అయితే పెద్ద నగదునోట్ల రద్దు కారణంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సమావేశానికి నితీష్ పార్టీ నుండి ఎవరూ హజరుకాలేదు. అయితే ఈ నిర్ణయాన్ని ఆ పార్టీ సమర్థించింది. విపక్షపార్టీలకు చెందిన కొందరు నాయకుల అహం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయని బీహర్ మాజీ ముఖ్యమంత్రి ఆర్ జె డి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపించారు. ఆయన పరోక్షంగా బీహర్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పై విమర్శలు చేశారు.

 ప్రభుత్వంపై పోరాటానికి సన్నద్దం

ప్రభుత్వంపై పోరాటానికి సన్నద్దం

ప్రభుత్వంపై పోరాటం చేసేందుకుగాను ఎనిమిది పార్టీలు నిర్ణయం తీసుకొన్నాయి. అయితే ఎనిమిది పార్టీలు ప్రభుత్వంపై ఏ రకమైన పోరాటం చేయాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. విపక్షాలు మూకుమ్ముడిగా పోరాటానికి సన్నద్దం చేయాలని కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు కొంత మేరకు సక్సెస్ అయ్యాయి.పెద్దనగదు నోట్ల రద్దుతో పాటు , సహరా డైరీల అంశాన్ని కూడ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతోంది. వీటితో పాటు మరికొన్ని అంశాలను కాంగ్రెస్ పార్టీ తెరమీదికి తీసుకువస్తోంది.

 గడువు ముగుస్తోంది, మంచి రోజులు వస్తాయా

గడువు ముగుస్తోంది, మంచి రోజులు వస్తాయా

పెద్ద నగదు నోట్ల రద్దు చేసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీ తనకు యాభై రోజుల సమయం ఇవ్వాలని కోరాడు. డిసెంబర్ 30వ, తేది తో రద్దుచేసిన నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకొనేందుకు అవకాశం ఉంది. ఈ గడువు ముగియడానికి ఇంకా రెండు రోజులు మాత్రమే సమయం ఉంది.అయితే విపక్షాలు మాత్రం గడువు ముంచుకొచ్చింది , ప్రధానమంత్రి ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. మంచి రోజులు తిరిగి వస్తాయా అని ప్రశ్నిస్తున్నారు. నగదు ఉపసంహరణపై ఉన్న ఆంక్షలు ఎత్తివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే విపక్షాలు తమ ఉనికి కోసం ప్రయత్నిస్తున్నాయని అధికార బిజెపి ఆరోపిస్తోంది. విపక్ష పార్టీల్లో ఐక్యత లేదని ఆ పార్టీ విమర్శించింది.

English summary
bihar deputy chief minister tejaswi yadav on wednesday backed trinamool congress (tmc) chief and west bengal chief minister mamata banerjee's assertion that the present situation in the country after the Centre's demonetization drive is a 'super emergency.'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X