వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిక్చర్స్: తేజ్‌పాల్ ఏడ్చేశాడు, లైంగిక పరీక్షలు పాజిటివ్

By Pratap
|
Google Oneindia TeluguNews

పానాజి: గోవా పోలీసుల విచారణలో తెహెల్కా వ్యవస్థాపక సంపాదకుడు తరుణ్ తేజ్‌పాల్ ఏడ్చేశాడు. మహిళా జర్నలిస్టుపై లైంగిక దాడి కేసులో గోవా పోలీసులు ఆయనను ఆదివారంనాడు విచారించారు. ఐదు గంటల పాటు తరుణ్ తేజ్‌పాల్‌ను డోనా పౌలాలోని తమ ఆఫీసులో పోలీసులు ప్రశ్నించారు. ఆ తర్వాత పానాజీ పోలీసు స్టేషన్‌కు ఆయనను తరలించారు.

అంతకు కోర్టు తేజ్‌పాల్‌ను ఆరు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించింది. తరుణ్ తేజ్‌పాల్‌ను దర్యాప్తు అధికారి పిఐ సునీతా సావంత్, తదితరులు విచారించారు. ఆదివారం సాయంత్రం 3 గంటల నుంచి తేజ్‌పాల్‌ను పోలీసులు విచారించారు. బాధితురాలు తన ఫిర్యాదులో తెలిపిన సంఘటనల గురించి పోలీసులు ఆయనను అడిగారు.

కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత

కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత

మహిళా జర్నలిస్టుపై లైంగిక దాడి కేసులో తరుణ్ తేజ్‌పాల్‌ను పానాజీలోని సెషన్స్ కోర్టులో ఆదివారం ప్రవేశపెట్టిన తర్వాత వెంట తీసుకుని వెళ్తున్న పోలీసులు

పానాజీలో..

పానాజీలో..

లైంగిక దాడి కేసులో అరెస్టు చేసిన తరుణ్ తే‌జ్‌పాల్‌ను శనివారం రాత్రి గోవాలోని వైద్య కళాశాలకు తీసుకుని వెళ్తున్న దృశ్యం.

ఎస్కార్టుతో తేజ్‌పాల్..

ఎస్కార్టుతో తేజ్‌పాల్..

సెషన్స్ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత తేజ్‌పాల్‌ను ఎస్కార్టుతో తరలిస్తున్న దృశ్యం. శనివారం రాత్రి తరుణ్ తేజ్‌పాల్‌ను అరెస్టు చేశారు.

కోర్టు నుంచి బయటకు వస్తూ ఇలా..

కోర్టు నుంచి బయటకు వస్తూ ఇలా..

లైంగిక దాడి కేసులో సెషన్స్ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఎస్కార్టు సహాయంతో ఇలా పోలీసులు తరుణ్ తేజ్‌పాల్‌ను తీసుకుని వెళ్తున్న దృశ్యం.

గోవా చేరుకున్న తర్వాత..

గోవా చేరుకున్న తర్వాత..

లైంగిక దాడిలో పోలీసుల ముందు హాజరు కావడానికి శుకర్వరాం గోవా చేరుకున్న తరుణ్ తేజ్‌పాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తేజ్‌పాల్ సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలికి, తరుణ్ తేజ్‌పాల్‌కి మధ్య జరిగిన సంభాషణ వివరాలను తెలుసుకోవడానికి వారు ఆ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. తేజ్‌పాల్‌కు బాధితురాలికి మధ్య ఈమెయిల్స్‌ సంభాషణలను రికార్డు చేయాల్సి ఉందంటూ పోలీసులు ఆయన కస్టడీని కోరారు.

పోలీసులు తేజ్‌పాల్ కస్డడీని 14 రోజుల పాటు కోరగా కోర్టు ఆరు రోజులు ఇచ్చింది. తేజ్‌పాల్ తన వ్యక్తిగత సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్, ఆఫీసు కంప్యూటర్ ద్వారా బాధితురాలికి మెయిల్స్ పంపి ఉంటాడని పోలీసులు కోర్టుకు తెలిపారు.

తరుణ్ తేజ్‌పాల్ లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయనను ఇందుకు ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. లైంగిక దాడి కేసులను ఎదుర్కునే నిందితులకు ఆ పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి అని పోలీసులు అంటున్నారు. తేజ్‌పాల్ వయస్సు 50 ఏళ్లు. గోవా వైద్య కళాశాలలో నిర్వహించిన లైంగిక పరీక్షలు పాజిటివ్‌గా వచ్చాయి. ఆయనకు రక్త పరీక్షలతో పాటు ఇతర పరీక్షలు కూడా నిర్వహించారు.

English summary
Tehelka founder editor Tarun Tejpal broke down on Sunday while being interrogated by Goa police crime branch at their office in Dona Paula, police officers said. The interrogation lasted five hours after which he was taken to Panaji police station lockup.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X