వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదేం భాష: చానళ్ల బ్యాన్‌పై కేసీఆర్‌కు ఘాటుగా ఖట్జూ

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి‌, టీవీ9 ప్రసారాలను పునరుద్ధరించకపోతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు సమస్యలు తప్పవని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌, మాజీ న్యాయమూర్తి మార్కండేయ ఖట్జూ హెచ్చరించారు.

గురువారం ఓ చానల్ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ మీడియాపై కేసీఆర్‌ వ్యాఖ్యలు అభ్యంతరకరమన్నారు. కేసీఆర్‌ తన భాషను మార్చుకోవాలని సూచించారు. మీడియా స్వేచ్ఛను హరిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ఏబీఎన్‌ ఏ తప్పు చేయకపోయినా ఎందుకు ప్రసారాలను నిషేధించారని ప్రశ్నించారు.

Telangana CM K Chandrashekhar Rao's comments on media highly objectionable: Markandey Katju

ప్రభుత్వం ఒత్తిడితోనే ఎంఎస్‌వోలు ప్రసారాలు నిలిపివేశారని అభిప్రాయపడ్డారు. చానళ్ల ప్రసారాలు పుననరుద్ధరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని, భవిష్యత్‌లోనూ ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు. ప్రెస్‌ కౌన్సిల్‌ ఆదేశాలు పాటించకపోతే ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు.

మీడియా పైన కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖట్జూ తీవ్రంగా ఖండించారు. అదే సమయంలో, మీడియా కూడా అభ్యంతరకరంగా ప్రసారాలు చేయడం సరికాదన్నారు. అయితే, సదరు టీవీ చానల్ ఇప్పటికే క్షమాపణలు చెప్పిందన్నారు. కేసీఆర్ తన భాషను మార్చుకోవాలన్నారు. కేసీఆర్ వాడిన భాష సరికాదని, అప్రజాస్వామికని, ముఖ్యంగా కేసీఆర్ అత్యున్నత స్థానంలో ఉన్నారని ఖట్జూ అన్నారు.

English summary
press council of India (PCI) Chairperson Justice (retd) Markandey Katju on Thursday termed the reported comments made by Telangana Chief Minister K Chandrasekhar Rao with regard to the Media as "highly objectionable and totally unacceptable in a democracy".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X