వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తేల్చని షిండే: కేబినెట్ తర్వాతే టీనా, రాయల టీనా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana - India
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందం (జివోఎం) తన పని పూర్తి చేసింది. దాదాపు గంటన్నర సేపు జివోఎం చివరి సమావేశం జరిగింది. రాయల తెలంగాణనా, తెలంగాణనా అనే విషయంపై స్పష్టత ఇవ్వడానికి సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే నిరాకరించారు. మంత్రివర్గ సమావేశం తర్వాత రాయల తెలంగాణనా, తెలంగాణనా అనే విషయం తెలుస్తుందని, మంత్రి వర్గ సమావేశం తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తామని ఆయన చెప్పారు.

అక్టోబర్ 3వ తేదీన మంత్రివర్గం తమకు అప్పగించిన పనిని పూర్తి చేశామని ఆయన చెప్పారు. జివోఎం సిఫార్సులపై రేపు గురువారం మంత్రివర్గ సమావేశంలో చర్చ జరుగుతుందని ఆయన చెప్పారు. రేపు జివోఎం నివేదిక, ముసాయిదా బిల్లు మంత్రి వర్గ సమావేశం ముందుకు వస్తుందని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లు - 2013ను జివోఎం ఖరారు చేసింది. రేపు సాయంత్రం ఐదు గంటలకు మంత్రి వర్గ సమావేశం జరుగుతుంది.

రేపు సాయంత్రం ఐదు గంటలకు మంత్రివర్గం సమావేశమైన చర్చించి నిర్ణయం తీసుకునే వరకు 12 జిల్లాల తెలంగాణనా, పది జిల్లాల తెలంగాణనా అనే సస్పెన్షన్ కొనసాగనుంది. చివరి సమావేశానికి కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ మినహా మిగతా జివోఎం సభ్యులంతా హాజరయ్యారు. జివోఎం రాష్ట్ర విభజనకు సంబంధించి 25 పేజీల నివేదికను, 70 పేజీల ముసాయిదా బిల్లును రూపొందించింది.

జివోఎం 11 అంశాలపై చర్చించి, వాటిపై తన సిఫార్సులను ఖరారు చేసింది. రేపు సాయంత్రం మంత్రి వర్గం ముసాయిదా బిల్లును ఆమోదించిన తర్వాత అది రాష్ట్రపతికి వెళ్తుందని, ఆ తర్వాత రాష్ట్ర శాసనసభకు అభిప్రాయం కోసం వెళ్తుందని చెబుతున్నారు. రాయల తెలంగాణ ప్రత్యామ్నాయం ఉందని సమావేశానికి ముందు జివోఎం సభ్యుడు జైరాం రమేష్ మీడియాతో చెప్పారు. 12 జిల్లాల తెలంగాణ వైపే జివోఎం మొగ్గు చూపినట్లు వార్తలు వస్తున్నాయి.

English summary
GOM has completed its work on the bifurcation of Andhra Pradesh state. Home minister Sushil kumar Shinde said that cabinet will clear all the aspects of bifurcation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X