వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ గవర్నర్‌గా కూతురు... కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటి పడనున్న తండ్రి...

|
Google Oneindia TeluguNews

తెలంగాణ గవర్నర్ తమళిసై సౌందరరాజన్ తండ్రి కుమారి అనంతన్ తమిళనాడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటి చేసేందుకు పోటిపడుతున్నారు. ఉప ఎన్నికల్లో భాగంగా నంగునేరి స్థానం నుండి ఆయన పోటి చేసేందుకు సిద్దమయ్యారు. కాగా ఇందుకోసం కాంగ్రెస్ మిత్రపక్షమైన డీఎంకే కూడ అంగీకరించింది.

రాజకీయాల్లో ఒకే కుటుంభం నుండి పలు పార్టీలకు ప్రాతినిధ్యం వహించడం సర్వసాధరణం.. ఈనేపథ్యంలోనే ఇటివల తెలంగాణకు గవర్నర్‌గా వచ్చిన తమిళసై సౌందరరాజన్ కుటుంబం కూడ అతీతం కాదు. బీజేపీ హర్డ్‌కోర్ కార్యకర్తగా ఉండి, గవర్నర్ బాధ్యతలు చేపట్టేవరకు తమిళసై సౌందరరాజన్ తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా కొనసాగింది. అయితే అమే తండ్రి కుమారి అనంతన్ కూడ గతంలో తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు.

Telangana governor Tamilisai Soundararajan’s father is in the race for Congress ticket

దక్షిణ తిరునెల్వేలి జిల్లాలోని నంగునేరి మరియు విల్లుపురంలోని విక్రవండి అసెంబ్లీ నియోజకవర్గాలకు అక్టోబర్ 21 న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే మరియు అనంతన్ తమ్ముడు హెచ్ వసంతకుమార్ కన్యాకుమారి నుండి లోక్‌సభకు ఎన్నికైన తరువాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో నంగునేరిలో ఉపఎన్నిక జరగనుంది. డిఎంకె శాసనసభ్యుడు కె. రాధమణి మరణం కారణంగా విక్రవండిలో ఉప ఎన్నికలు జరగుతున్నాయి. అయితే విక్రవండి నియోజవర్గంలో డీఎంకే అభ్యర్థిని ప్రకటించగా నంగునేరిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.

English summary
Telangana governor Tamilisai Soundararajan’s father, Kumari Ananthan is in the race for a ticket to contest the assembly bypoll in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X