వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసదుద్దీన్ లేవగానే భారత్ మాతాకీ జై నినాదాలతో హోరెత్తిన ‌లోక్‌సభ.. తడబడ్డ రేవంత్, నామా, కోమటిరెడ్డి..

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : కొత్తగా కొలువుదీరిన 17 లోక్‌సభలో ఎంపీల ప్రమాణస్వీకారం రెండో రోజు కొనసాగింది. మంగళవారం తెలంగాణకు చెందిన ఎంపీలు ప్రమాణం చేశారు. టీఆర్‌ఎస్‌ నుంచి 9 మంది ఎంపీలు, కాంగ్రెస్‌ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఇద్దరు, ఎంఐఎం నుంచి ఒక ఎంపీ ప్రమాణస్వీకారం చేశారు. సభ్యుల ప్రమాణం సందర్భంగా లోక్‌సభలో కొన్ని ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రమాణం చేసే సమయంలో కొందరు సభ్యులు తడబడ్డారు.

అసద్ లేవగానే జై భారత్ నినాదాలు

అసద్ లేవగానే జై భారత్ నినాదాలు

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకార సమయంలో సభలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రమాణం చేసేందుకు ఓవైసీ పేరు పిలవగానే సభలోని బీజేపీ ఎంపీలు భారత్ మాతాకీ జై, వందేమాతరం నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఆయన తన ఇంకా చేయండంటూ సంజ్ఞలతో వారిని ఉత్సాహపరిచారు. ప్రమాణం అనంతరం సంతకం చేయడం మరిచిపోయిన అసద్‌కు లోక్‌సభ సిబ్బంది గుర్తు చేశారు.

జై భీం, జై హింద్ నినాదాలు చేసిన అసద్

జై భీం, జై హింద్ నినాదాలు చేసిన అసద్

ఇదిలా ఉంటే అసదుద్దీన్ ఉర్దూలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు.
'అసదుద్దీద్ అను నేను పార్లమెంటు సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల, శాసన వ్యవస్థ పట్ల పూర్తి విశ్వాసం, నిబద్ధతతో నడుచుకుంటానని ప్రమాణం చేస్తున్నాను' అని ప్రమాణం చేసిన అసద్.. జై భీమ్, తక్‌బీర్, అల్లాహో అక్బర్, జైహింద్ నినాదాలతో ముగించారు.

 మొబైల్‌లో చూస్తూ తడబడ్డ రేవంత్

మొబైల్‌లో చూస్తూ తడబడ్డ రేవంత్

అసద్ అనంతరం మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఆయన తన మొబైల్‌లో చూస్తూ తెలుగులో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. అయితే ప్రమాణం మధ్యలో ఆయన కాస్త తడబడ్డారు. సర్వసత్తాక అధికారం అనే పదాన్ని పలకడంలో రేవంత్ ఇబ్బంది పడ్డారు.

 జై తెలంగాణ, జై హింద్, జై భారత్ నినాదాలు

జై తెలంగాణ, జై హింద్, జై భారత్ నినాదాలు

తెలంగాణ ఎంపీలలో వెంకటేశ్ నేతకాని, బండి సంజయ్ కుమార్, సోయం బాపూరావ్, కొత్త ప్రభాకర్ రెడ్డి, రేవంత్ రెడ్డి, పోతుగంటి రాములు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పసునూరి దయాకర్, మాలోతు కవిత, నామా నాగేశ్వర రావు తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు. ధర్మపురి అరవింద్, రంజిత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఇంగ్లీషులో బీబీ పాటిల్ హిందీలో, అసదుద్దీన్ ఒవైసీ ఉర్దూలో ప్రమాణం చేశారు. చేసిన నేతకాని వెంకటేశ్ ఈశ్వరుడి సాక్షిగా ప్రమాణం చేయగా.. ఆయనతో పాటు కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రమాణం అనంతరం జై తెలంగాణ, జైజై భారత్ నినాదాలు చేశారు. బండి సంజయ్ కుమార్, ధర్మపురి అరవింద్ భారత్ మాతాకీ జై, బీబీ పాటిల్ జై తెలంగాణ, జైజై తెలంగాణ, ఉత్తర్ కుమార్ రెడ్డి జై హింద్ జై తెలంగాణ, మాలోత్ కవిత జై తెలంగాణ, జై బంజారా నినాదాలు చేశారు. ప్రమాణస్వీకారం సందర్భంగా నామాతో పాటు కోమటి రెడ్డి వెంకటరెడ్డి తడబడ్డారు. కోమటిరెడ్డి నేను అనే పదాన్ని నును అని పలికారు.

English summary
On second day of Loksabha session Telangana mps took oath. 11 mps took oath in telugu, four in english, each in hindi, and urdu. when hyderabad mp asaduddin taking oath bjp mps shouted jai bharat, vandemataram slogans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X