• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తల్లీ కూతుళ్ల వివాదం..! మద్యలో తెలంగాణ పోలీసులు..!! బిగ్ బాస్ పబ్లిసిటీ స్కెచ్చేనా..?

|

చెన్నై/హైదరాబాద్ : బిగ్ బాస్ అంటేనే అసంబద్ద కార్యకలాపాలతో వివిధ మనోభావాలు కలిగి ఉన్న వేర్వేరు మనస్తత్వం కలిగిన వ్యక్తుల సమూహం చేసే విచిత్ర చేష్టల కార్యక్రమంగా ముద్రవేసుకుంది. అందులో పాల్గొన్న పోటీ దారులు వాస్తవ పరిస్ధితులకు భిన్నంగా వ్యవహరిస్తూ సంచలనం చేయాలని ప్రవర్తిస్తుంటారు. ఇక చెన్నైలో జరుగుతున్న బీగ్ బాస్ మూడవ సీజన్లో పాల్గొన్న ప్రముఖ నటి వనిత బిగ్ బాస్ హౌస్ లోచేసే సంచలనాల కన్నా బయటచేసే సంచలనాలే ఎక్కువగా ఉన్నాయి. వ్యక్తిగత జీవితంలో నెలకొన్న ఒడిదొడుకులను సామాజంలో ప్రతిబింబించేలా వ్యవహరించడమే కాకుండా తెలంగాణ పోలీసులకు కూడా చేతినిండా పని చెప్పారు వనిత.

వివాదాల వనిత..! వామ్మో అంటున్న పోలీసులు..!!

వివాదాల వనిత..! వామ్మో అంటున్న పోలీసులు..!!

వివాదాలు చుట్టు ముట్టిన నటి వనిత కుమార్తె ఇచ్చిన వాంగ్మూలంతో కిడ్నాప్‌ కేసునుంచి బయట పడింది. స్కూల్‌కు వెళ్ళిన తన కుమార్తె జోనితను వనిత కిడ్నాప్‌ చేసిందని హైదరాబాద్‌కు చెందిన ఆమె మాజీ భర్త ఆనంద్‌రాజ్‌ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిగ్‌బాస్‌ షోలో వనిత పాల్గొన్న విషయం తెలుసుకున్న ఆయన తెలంగాణా పోలీసులతో స్ధానిక నాజరత్‌ పేట పొలీసుల సహయంతో బుధవారం ఉదయం బిగ్‌బాస్‌ హౌస్‌లో వున్న వనిత వద్ద సుమారు రెండు గంటల సేపు విచారణ చేపట్టిన విషయంతెలిసిందే.

వ్యక్తిగత జీవితం..! బిగ్ బాస్ పై ప్రభావితం..!!

వ్యక్తిగత జీవితం..! బిగ్ బాస్ పై ప్రభావితం..!!

అనంతరం ఆమె సాయంత్రం 5గంటలకు తన కుమార్తెను పొలీసుల ముందు హజరుపరుస్తానని అంగీకరించింది. ఆమేరకు వనిత కుమార్తెను ఆమె న్యాయవాది సహయంతో పొలీసుల ముందు హజరుపరిచారు. తనను ఎవరు నిర్భందించ లేదని, ఇష్టపూర్వకంగా తన తల్లితో వచ్చాన ని, ఆమె దగ్గరే వుండేందుకు ఇష్టపడుతున్నానని జోనిత వాం గ్మూలం ఇచ్చింది. కుమార్తె వాంగ్మూలంతో వనిత కిడ్నాప్‌ కేసు నుంచి బయటపడింది .ప్రస్తుతం ఆమె బిగ్‌బాస్‌ హౌస్‌ లో కొనసాగుతోంది.

వివాదాన్ని చల్లార్చిన కూతురు..! బిగ్‌బాస్‌ హౌస్‌లో కొనసాగింపు..!!

వివాదాన్ని చల్లార్చిన కూతురు..! బిగ్‌బాస్‌ హౌస్‌లో కొనసాగింపు..!!

సీనియర్ నటులు మంజుల, విజయ్‌ కుమార్‌ల పెద్ద కుమార్తె వనిత వివాదం మరింత ముదురుతోంది. గత పదేళ్లుగా వనిత ఏదో ఒక వివాదంతో వార్తల్లో కనిపిస్తూనే ఉన్నారు. కొంత కాలం పాటు తండ్రితో గొడవపడిని వనిత, భర్తనుంచి విడిపోయిన తరువాత కూతురి విషయంలో అతనితో గొడవపడుతున్నారు. ప్రస్తుతం తమిళ బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో కంటెస్టెంట్‌గా ఉన్న వనితను అరెస్ట్ చేసేందుకు తెలంగాణ పోలీసులు చెన్నైకి చేరుకున్నారు. 2007 ఆనంద్‌ రాజ్‌ను వివాహం చేసుకున్న వనిత 2012లో విడాకులు తీసుకున్నారు.

పోలీసుల హైరానా..! అరెస్టు చేసేందుకు చెన్నై వెళ్లిన తెలంగాణ పోలీసులు..!!

పోలీసుల హైరానా..! అరెస్టు చేసేందుకు చెన్నై వెళ్లిన తెలంగాణ పోలీసులు..!!

అప్పటి నుంచి కూతురు జోవిత సంరక్షణ బాధ్యతల విషయంలో వీరిద్దరి మధ్య వివాదం జరుగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వనిత తన కూతరిని చెన్నై తీసుకెళ్లి దాచిపెట్టినట్టుగా ఆనంద్‌ రాజ్‌ తెలంగాణ పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. ఈ మేరకు వనితపై కిడ్నాప్‌ కేసు నమోదు చేసిన విచారణ జరిపిన పోలీసులలు అరెస్ట్‌కు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే బిగ్‌బాస్‌ సెట్‌ ఉన్న ఈవీపీ ఫిలిం సిటీ ప్రాంతానికి చెందిన నజ్రత్‌ పోలీస్‌ స్టేషన్‌ను సంప్రదించిన తెలంగాణ పోలీసులు వనిత అరెస్ట్‌కు సహకరించవలసిందిగా కోరారు. ప్రస్తుతం బిగ్‌బాస్‌ సెట్‌లో ఉన్న వనితను తెలంగాణ పోలీసులు ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The kidnapping case has come out with a statement given by the daughter of the actress, who was surrounded by controversy. Her former husband Anandraj from Hyderabad complained to the police that Vanitha had kidnapped her daughter, Jony, who went to school.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more