వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియో కాల్స్ చేస్తున్నారా... కస్టమర్లకు టెలికాం,ట్రాయ్ తాజా హెచ్చరిక...

|
Google Oneindia TeluguNews

ఆన్‌లైన్ వీడియో-కాలింగ్ లేదా జూమ్,మైక్రోసాఫ్ట్ యాప్స్ ద్వారా చేసే వీడియో కాల్స్‌కు టోల్ ఫ్రీ నంబర్లను ఉపయోగించకపోతే ఇంటర్నేషనల్ కాలింగ్ రేట్స్ వర్తించబడుతాయని టెలికాం కంపెనీలు సబ్‌స్క్రైబర్స్‌ను హెచ్చరించాయి. ఈ మేరకు ఎస్ఎంఎస్ ద్వారా కస్టమర్లకు అలర్ట్స్ పంపించాయి. జూమ్,మైక్రోసాఫ్ట్ తదితర యాప్స్ డయల్-ఇన్ ఫీచర్స్‌లో ఇంటర్నేషనల్‌ నంబర్స్‌ని ఉపయోగిస్తే ఐఎస్‌డీ చార్జీలు తప్పవని సబ్‌స్క్రైబర్లను హెచ్చరించాల్సిందిగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(Trai) ఆదేశించిన నేపథ్యంలో టెలికాం కంపెనీలు ఈ అలర్ట్స్ పంపించాయి.

కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్ని నెలల్లో కస్టమర్ల నుంచి భారీ బిల్లులకు సంబంధించిన ఫిర్యాదులు వెల్లువెత్తడటంతో ట్రాయ్ నుంచి టెలికాం సంస్థలకు ఆదేశాలు వెళ్లాయి. 'ఎవరైనా ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ నుంచి లాగిన్ అయినప్పుడు... బిల్ట్-ఇన్-ఆడియో ఆప్షన్‌ని ఉపయోగిస్తే ఎలాంటి సమస్య ఉండదు. కానీ చాలామంది తమ మొబైల్ ఫోన్స్ నుంచి కాల్స్ చేస్తుండటంతో ఐఎస్‌డీ చార్జీలు వర్తిస్తున్నాయి.' అని ఓ టెలికాం ఎగ్జిక్యూటివ్ తెలిపారు.

Telcos warn users to be wary of ISD charges for online meeting apps

Recommended Video

Reliance Industries Ranked 2nd Biggest Brand Globally After Apple || Oneindia Telugu

కరోనా కారణంగా గత ఆర్నెళ్లుగా వర్క్ ఫ్రమ్ హోమ్ పెరిగిపోవడంతో భారత్‌లో వీడియో కాలింగ్,మీటింగ్ యాప్స్‌ను రెగ్యులర్‌గా ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వీడియో కాలింగ్ యాప్స్ డౌన్ లోడ్స్ పెరిగిపోయాయి. దీంతో కస్టమర్లను తమవైపుకు తిప్పుకునేందుకు అమెరికాకు చెందిన వెరిజాన్ ఆపరేటర్‌తో కలిసి భారతీ ఎయిర్‌టెల్ వీడియో కాన్ఫరెన్స్ సర్వీస్ బ్లూ జీన్స్ యాప్‌ను లాంచ్ చేసింది. అలాగే జియో సంస్థ కూడా జియో మీట్ అనే వీడియో కాన్ఫరెన్స్ యాప్ లాంచ్ చేసింది.

English summary
Telecom companies have warned subscribers that the dial-in numbers for online video-calling or meeting applications like Zoom and Microsoft Teams may attract international calling rates if toll-free numbers are not used.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X