వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జియో షాక్: ఉచిత ఆఫర్లకు త్వరలోనే ముగింపు?

టెలికం పరిశ్రమలో త్వరలో ధరల యుద్దానికి తెరపడనుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ అభిప్రాయపడింది వచ్చే నెల 12-18 నెలలో ఒక దశ వద్ద తన పోటీ వ్యూహన్ని హేతుబద్దం చేస్తోందని గ్లోబల్ రేటింగ్ .

By Narsimha
|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: టెలికం పరిశ్రమలో త్వరలో ధరల యుద్దానికి తెరపడనుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ అభిప్రాయపడింది వచ్చే నెల 12-18 నెలలో ఒక దశ వద్ద తన పోటీ వ్యూహన్ని హేతుబద్దం చేస్తోందని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ తెలిపింది.

మార్కెట్లోకి ప్రవేశంతోనే రిలయన్స్ జియో సంచలనాలను సృష్టించింది. ఉచితంగా వాయిస్‌కాల్స్, డేటా ఇచ్చి వినియోగదారులను ఆకట్టుకొంది. మరో వైపు తన ఉచిత ఆఫర్లను పలు రకాల పేర్లతో పొడిగించింది.

అయితే ఉచిత ఆఫర్ల కారణంగా ఇతర టెలికం కంపెనీలు జియోపై ట్రాయ్‌కు ఫిర్యాదులను కూడ చేశాయి. అయితే ఉచిత ఆఫర్లకు జియో చెల్లుచీటి చెప్పనుందని గ్లోబల్ రేటింగ్స్ సంస్థ అభిప్రాయపడుతోంది.

జియో కారణంగా టెలికం పరిశ్రమ వందల కోట్లను నష్టపోయినట్టుగా కూడ నివేదికలు వెల్లడించాయి. అయితే ఫీచర్ ఫోన్ కారణంగా మార్కెట్ ఆదాయం పెరిగే అవకాశం ఉందని కూడ నిపుణులు అంచనావేస్తున్నారు.

జీవితాంతం ఉచిత హమీలను కొనసాగించలేరు

జీవితాంతం ఉచిత హమీలను కొనసాగించలేరు

భారీ డిస్కౌంట్స్, ఉచిత ఆఫర్లతో ఏడాది కంటే తక్కువ సమయంలోనే దేశంలోని 10 శాతం టెల్కో చందాదారుల బేస్‌ను జియో స్వంతం చేసుకొంది. కానీ, ఈ భఆరీ డిస్కౌంట్ విధానాలు జీవితకాలం కొనసాగించలేదని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ క్రెడిట్ అనాలిస్గ్ ఆశుతోష్ శర్మ చెప్పారు.

Recommended Video

Idea to Launch New Cheap Smartphone To counter Reliance Jio's Phone
రెవిన్యూల కోసం తీవ్రంగా శ్రమించాల్సిందే

రెవిన్యూల కోసం తీవ్రంగా శ్రమించాల్సిందే

జియో తెరతీసిన ఈ గేమ్‌లో పాల్గొన్న పోటీదారులంతా రెవెన్యూలు, లాభాలు, నగదు నిల్వల కోసం తీవ్రంగా శ్రమించారని ఈ రేటింగ్ ఏజెన్సీ ప్రకటించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో జియో మార్కెట్‌లోకి ప్రవేశించింది.జియో ప్రవేశంతో ఒక్కసారిగా మార్కెట్ తీవ్ర కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంది.

జియో కారణంగా టారిఫ్ ప్లాన్స్ మార్చిన ఇతర కంపెనీలు

జియో కారణంగా టారిఫ్ ప్లాన్స్ మార్చిన ఇతర కంపెనీలు

జియో డేటా రేట్లు కూడ ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న కంపెనీల కంటే తక్కువగానే ఉన్నాయి. జియో దెబ్బకు ఎయిర్‌టెల్ , వోడాఫోన్, ఐడియా సంస్థలు కూడ ఉచితంగానే వాయిస్ కాల్స్, తక్కువ డేటా ఆఫర్లను తీసుకువచ్చాయి.

లాభం తగ్గినా మార్కెట్‌లో నిలబడేందుకు

లాభం తగ్గినా మార్కెట్‌లో నిలబడేందుకు

రెవిన్యూ లాభాలు తక్కువ ఉన్న.ప్పటికీ, మార్కెట్ స్థానాన్ని కాపాడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాయి ఇతర టెలికం కంపెనీలు.. దరిమిలా కన్సాలిడేషన్ ఏర్పడింది. వోడాఫోన్, ఐడియాలు వీలినమయ్యాయి. టెలినార్‌ను ఎయిర్‌టెల్ స్వంతం చేసుకొంది. ఇక ఆర్‌కామ్, ఎంటీఎస్, ఎయిర్‌సెల్‌లు కూడ ఈ దిశలోనే ఉణ్నాయి. ఈ కన్సాలిడేట్‌లో వొడాఫోన్-ఐడియా విలీన సంస్థ, ఎయిర్ టెల్, జియో సంస్థలే 75-85 శాతం ఇండస్ట్రీ రెవిన్యూలను స్వంతం చేసుకోనున్నాయని ఆ సంస్థ తెలిపింది.

English summary
India's big phone companies may be burning cash amid brutal competition for market share, but the fight for subscribers by offering rock-bottom prices triggered by the entry of Reliance Jio Infocomm "is in its final stages", S&P Global Ratings said on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X