వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంపర్ ఆఫర్: రూ.47కే 56 జీబీ, 4జీ డేటా, జియోకు షాకేనా?

రిలయన్స్ పుణ్యమాని ఇతర టెలికం కంపెనీలు కూడ తమ టారిఫ్ రేట్లను ఆమాంతం తగ్గిస్తున్నాయి. కస్టమర్లను తమ వైపుకు తిప్పుకొనేందుకుగాను ఆయా కంపెనీలు తమ ఉచిత ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై: రిలయన్స్ పుణ్యమాని ఇతర టెలికం కంపెనీలు కూడ తమ టారిఫ్ రేట్లను ఆమాంతం తగ్గిస్తున్నాయి. కస్టమర్లను తమ వైపుకు తిప్పుకొనేందుకుగాను ఆయా కంపెనీలు తమ ఉచిత ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.

ఉచిత ఆఫర్లతో రిలయన్స్ జియో ఇతర టెలికం కంపెనీలకు చుక్కలు చూపించింది.రిలయన్స్ జియోతో పోటీపడేందుకుగాను ఇతర టెలికం కంపెనీలు కూడ టారిఫ్ లలో మార్పులు చేర్పులు చేశాయి.

ఎడాపెడా ఛార్జీలను వసూలు చేసిన టెలికం కంపెనీలు ఉచిత ఆఫర్లంటూ ఊదరగొడుతున్నాయి.అనివార్య పరిస్థితుల్లో ఈ టెలికం కంపెనీలు ఉచిత ఆఫర్లకు కూడ సిద్దం కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

రిలయన్స్ ఏప్రిల్ నుండి తమ కస్టమర్ల నుండి ఛార్జీలు వసూలు చేయనుంది. దాదాపుగా ఆరు మాసాల నుండి ఉచితంగా తమ కస్టమర్లకు సేవలను అందించింది. అయితే దీనిపై కూడ టెలికం కంపెనీలు ట్రాయ్ తో పాటు ఇతర సంస్థలను ఆశ్రయించాయి.

టెలినార్ బంపర్ ఆఫర్ ఇదే

టెలినార్ బంపర్ ఆఫర్ ఇదే

రిలయన్స్ జియో ఎఫెక్ట్ తో టెలినార్ కంపెనీ బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. కేవలం రూ.47 చెల్లిస్తే 56 జీబీ 4 జీ డేటాను ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం నాడు స్పెషల్ ప్లాన్ ను ప్రకటించింది.ఈ డేటా కాలపరిమితి సుమారు 28 రోజుల పాటు ఉంటుంది.అయితే ఎవరైతే రోజుకు గరిష్టంగా 2 జీబీ డేటాను వాడుతారో వారికే దీన్ని వర్తింపజేస్తామని టెలినార్ ప్రకటించింది.

షరతులు వర్తిస్తాయి

షరతులు వర్తిస్తాయి

టెలినార్ స్పెషల్ ప్లాన్ లో రూ.47 లకు56 జీబీ 4జీ డేటాను అందించేందుకుగాను కొన్ని షరతులను విధించింది టెలినార్. ప్రతి రోజూ 2 జీబీ డేటా ఉపయోగించేవారికే దీన్ని వర్తింపజేయనున్నారు.దీంతో పాటుగా ఈ కొత్త ప్లాన్ కింద 80 పైసలకే 1 జీబీ డేటాను అందిస్తామని ప్రకటించింది.అయితే అర్హత గల యూజర్లకు తామే ఎస్ఎంఎస్ లను పంపనున్నట్టు టెలినార్ ప్రకటించింది.

జియో ఎఫెక్ట్ తో కొత్త ప్లాన్

జియో ఎఫెక్ట్ తో కొత్త ప్లాన్

రిలయన్స్ జియో ఎఫెక్ట్ తో టెలికం కంపెనీలు కొత్త ప్లాన్ లను ఇస్తున్నాయి. అయితే ఈ ఆఫర్ రిలయన్స్ కొత్తగా అమలు చేయబోతున్న రూ.303 ప్లాన్ లను పోలి ఉందని ప్రచారం సాగుతోంది. అయితే జియోను టార్గెట్ గా చేసుకొని టెలినార్ ఈ ఆఫర్ ను ప్రకటించిందనే సమాచారం.అయితే ఈ ప్లాన్ లో ఉచిత వాయిస్ కాల్స్ ను జియో ఇవ్వడం లేదు.

.కస్టమర్లను ఆకర్షించేందుకు

.కస్టమర్లను ఆకర్షించేందుకు

కష్టమర్లను తమ వైపుకు తిప్పుకొనేందుకుగాను టెలికం కంపెనీలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి,. తమకు పోటీ కంపెనీలకు గట్టిపోటీని ఇచ్చేందుకుగాను టెలికం కంపెనీలు కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తమకు పోటీగా ఉందని భావిస్తున్న ఆఫర్లను పోలిన వాటినే ప్రకటిస్తున్నాయి. అయితే రిలయన్స్ జియో పోటీని తట్టుకొనేందుకే టెలికం కంపెనీలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.

English summary
norway-based telecom company Telenor has come out with a new India-specific plan that offers 56GB of 4G data with a validity of 28 days for just Rs 47. Subscribers who opt for the plan can use a maximum of 2GB of data every day. Telenor says its new plan gives users 1GB data for a mere 80 paisa. Conditions, however, apply.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X