వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరుదైన చేప: కిలో రూ.16 వేలు.. వేలంలో రూ.4.48 లక్షలు...రాత్రికి రాత్రే తిరిగిన సుడి..

|
Google Oneindia TeluguNews

సముద్రంలో అనేక జంతుజాలం ఉంటుంది. చేపలు, రొయ్యలు ఉంటాయి. అయితే వాటిలో తినడానికి పనికొచ్చేవి కొన్ని కాగా.. మరికొన్ని ఔషధాల కోసం పనికొస్తాయి. అప్పుడప్పుడు జాలర్లకు అరుదైన చేపలు వలలో చిక్కుకుంటాయి. అలా ఓ జాలర్‌కు కూడా తెలియా బేక్టి అనే చేప పడింది. అదీ 28 కిలోల బరువు కూడా ఉంది. ఇంకేముంది ఆ జాలర్ పట్టింది చేప కాదు.. బంగారంలా మారింది.

జలేశ్వర్‌కి చెందిన జాలరీ బెంగాల్, ఒడిశా సరిహద్దులో వేటకు వెళ్లాడు. సముద్రంలో తెలియా భేక్టి అనే చేప వలలో పడింది. ఈ చేప అరుదుగా లభిస్తోందని తోటి జాలర్లు చెబుతున్నారు. చేపలోని కొన్ని భాగాలతో ఔషధాలు తయారు చేస్తారని చెబుతున్నారు. చేప గురించి తెలిసి వేలం వేయడం ప్రారంభించారు. అసలే ఆ చేప 28 కిలోల బరువు కూడా ఉంది. ఇంకేముంది ఒకరిని మించి మరొకరు వేలం వేశారు. దక్కించుకునేందుకు పోటీ రావడంతో చేపకు అధిక ధర వచ్చింది.

telia bhekti fish gets huge price in auction

వేలం పాటలో కిలోకు రూ.16 వేల చొప్పున ధర పలికింది. అంటే 28 కిలోల చేపకు అక్షరాల 4.48 లక్షలు పలికింది. ఏఎంఆర్ సంస్థ చేపను వేలంలో దక్కించుకుంది. చేపతో మత్స్యకారుడు లక్షాధికారి అయ్యారు. చేప వల్ల తన కష్టాలు తీరాయని.. సుఖ సంతోషంగా ఉంటానని చెబుతున్నారు. అదే మరీ రాత్రికి రాత్రే సుడి తిరగడం అంటే ఇదేమరీ. ఒక్కరోజులో ఆ మత్స్యకారుడు లక్షాధికారిగా మారాడు.

English summary
telia bhekti fish gets 4.48 price in auction west bengal
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X