వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నరేంద్రుడి మయ సభ..! తెలుగు ఎంపీల ప్రవేశం పై ఆసక్తికర చర్చ..!!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్: అసాద్యాన్ని తెలంగాణ బీజేపి నేతలు సుసాద్యం చేసారు. అసలు బోణీ కొడుతుందా అనే సందేహాన్ని పటాపంచలు చేస్తూ ఏకంగా నాలుగు లోక్ సభ స్థానాలను తన ఖాతాలో వేసుకుని అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది బీజెపి. దీంతో బీజేపీ టార్గెట్ ను నెర వేరుస్తూ తెలంగాణ‌లో బీజేపి గట్టిగానే పాగావేసింది. రానున్న ఐదేళ్లలో పార్టీ మరింతద బలోపేతానికి అవసరమయ్యే స‌రంజామాను స‌మ‌కూర్చుకోవ‌ట‌మే త‌దుప‌రి ల‌క్ష్యంగా తెలుస్తోంది. తెలంగాణాలో నాలుగు ఎంపీ సీట్లు గెలిచి మాంచి ఊపుమీదున్న క‌మ‌ల‌నాథులు ఇదే దూకుడును 2024 వ‌ర‌కూ కొన‌సాగించాల‌నే యోచ‌న‌లో ఉన్నారు. ముఖ్యంగా టీఆర్ స్‌కు ప్రతిష్టాత్మకమైన ఎంపీ స్థానాల‌ను కైవ‌సం చేసుకోవ‌టం ద్వారా స‌త్తాచాటుకున్నారు. దీంతో కేంద్ర మంత్రి వర్గంలో చోటు కోసం కూడా ఇక్కడి నేతలు ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణ నుంచి చోటు ఎవరికో..!!

తెలంగాణ నుంచి చోటు ఎవరికో..!!

మోదీ డ్రీమ్ క్యాబినెట్..! తెలంగాణ నుంచి చోటు ఎవరికో..!!
అయితే సీనియ‌ర్ నేత‌లు చేతులు ఎత్తేసిన స‌మ‌యంలో అదిలాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, నిజామాబాద్ వంటి కీల‌క‌మైన ప్రాంతాల్లో కాషాయ‌జెండా ఎగుర‌వేసిన నేత‌ల్లో కీల‌క‌మైన వారు నిజామాబాద్‌, క‌రీంన‌గ‌ర్ నుంచి గెలిచిన అర్వింద్‌, సంజ‌య్‌. ఆరు నెల‌ల క్రితం జ‌రిగిన శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం పాలైన ఆ ఇద్ద‌రికీ జిల్లాలో మంచి పేరుంది. ప్ర‌జ‌ల్లో గౌర‌వం ఉంది. ఇది నిజ‌మ‌ని చాటుతూ ప్ర‌జ‌లు కూడా ఆ ఇద్ద‌రికీ ఎంపీలుగా గెలిపించారు.

 ప్రతిష్టాత్మకమైన సీట్లు గెలిచిన బీజేపి..! క్యాబినెట్ లోకి తీసుకుంటే మరింత ఉత్సాహం..!!

ప్రతిష్టాత్మకమైన సీట్లు గెలిచిన బీజేపి..! క్యాబినెట్ లోకి తీసుకుంటే మరింత ఉత్సాహం..!!

ఇంత‌టి న‌మ్మ‌కాన్ని ఇప్పుడు సొమ్ము చేసుకోకుండే భ‌విష్య‌త్ లో భాజ‌పా ఎదుగుద‌ల ఉండ‌ద‌ని భావించి అమిత్‌షా, మోదీలు త‌మ కేబినెట్‌లో స‌హాయ‌మంత్రులుగా సంజయ్, అర్వింద్‌ల‌కు చోటివ్వాల‌నే యోచ‌న‌లో ఉన్నార‌ట‌. సీనియ‌ర్ నేత కిష‌న్‌రెడ్డి పేరు వినిపించినా సానుకూల నివేదిక వ‌ల్ల తాత్కాలికంగా కిష‌న్‌రెడ్డి పేరు ప‌క్క‌న‌బెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఒక‌వేళ జ‌గ‌న్ కూడా ఎన్‌డీఏ కూట‌మిలో చేరితే.. అక్క‌డ ఇద్ద‌రు ఎంపీల‌కు మంత్రిప‌ద‌వులు ఇవ్వాల్సి వ‌స్తుంద‌నే ఉద్దేశంతో మోదీ ఆచితూచి స్పందిస్తున్నార‌ట‌.

 గెలిచిన వాళ్లు పక్కా బీజేపి నేతలు..! మంత్రివర్గం పై ఆశలు పెట్టుకున్న ఆ నలుగురు..!!

గెలిచిన వాళ్లు పక్కా బీజేపి నేతలు..! మంత్రివర్గం పై ఆశలు పెట్టుకున్న ఆ నలుగురు..!!

అయితే.. తెలంగాణ‌లో గెలిచిన ఎంపీలు భారతీయ జ‌నతా పార్టీ జెండా కింద ఎదిగిన వారే కావ‌టంతో వీరిలో అర్వింద్‌కు ప్రాముఖ్య‌త ఇవ్వాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. సంజయ్‌కు తెలంగాణ బీజేపీ ప‌గ్గాలు అప్ప‌గించి.. అర్వింద్‌ను మంత్రిని చేయ‌టం ద్వారా తెలంగాణ‌లో బాజపా మ‌రింత బ‌ల‌ప‌డుతుంద‌నేది బీజేపీ వ్యూహం. కిష‌న్‌రెడ్డి మాత్రం తాను కేబినెట్‌లో ఉండాల‌నే ఉద్దేశంతో త‌న‌కు అనువుగా ఉన్న అన్ని మార్గాలలో లాబీయింగ్ చేస్తున్న‌ట్లు స‌మాచారం.

 మోదీ మనసులో ఎవరున్నారో మరి..!!

మోదీ మనసులో ఎవరున్నారో మరి..!!

కిషన్ రెడ్డికి అవకాశం..! మోదీ మనసులో ఎవరున్నారో మరి..!!
గ‌తంలో పార్టీ పెద్ద‌ల‌తో ఉన్న ప‌రిచ‌యాల‌ను బ‌య‌ట‌కు తీసి మంత్రి కిష‌న్‌రెడ్డి తెలంగాణ‌లో కీల‌కంగా మారాల‌ని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మోదీ మాత్రం.. క‌విత‌ను ఓడించిన సంజ‌య్‌కు మంత్రి ప‌ద‌వితోపాటు.. రెండు తెలుగు రాష్ట్రాల ప‌ర్య‌వేక్ష‌ణ‌ను కూడా అప్ప‌గించ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. మ‌రి ఈ లెక్క‌న‌.. మోదీ రెండోసారి ఏర్పాటుచేసే మంత్రిమండ‌లిలో ఉండ‌బోయే తెలుగు వ్య‌క్తి ఎవ‌ర‌నేది ఇప్ప‌టికైతే స‌స్పెన్స్‌ గానే కొనసాగుతోంది. ఉత్కంఠ వీడాలంటే ఈ నెల 30వరకు వేచి చూడాల్సిందే..!

English summary
The Telangana BJP leaders have been doing an extraordinary job. The BJP is surprised by the fact that it has four MPs in the hands of the BJP,The leaders of the party are also looking for a place in the union cabinet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X