• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్లవ నామ సంవత్సరం: విష్ చేసిన జగన్, కేసీఆర్, పవన్ కల్యాణ్, పోచారం

|

తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ప్రముఖులు విష్ చేశారు. ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తదితరులు విష్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఉగాది శుభాకాంక్షలు అంటూ సీఎం జగన్ ప్రకటనలో శుభాకాంక్షలను తెలియజేశారు. ప్లవ నామ సంవత్సరంలో ఇంటింటా సిరులు, ఆనందాలు నిండాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా సుభిక్షంగా ఉండాలని అభిలషించారు.

పవన్ విషెస్

పవన్ విషెస్

తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. మనోవికాసం పరిమళిస్తూ.. మానవత్వం గుబాళించే సుసంపన్న సంప్రదాయాన్ని తరతరాలకు చేరవేస్తున్న పండుగగా ఉగాదిని అభివర్ణించారు. ప్లవ అంటే దాటించునది అని.. సంస్కృతి, సంప్రదాయాల కలయికతో వస్తున్న ప్లవ నామ సంవత్సరం ప్రజలను కష్టాలు, కరవుకాటకాల నుంచి సంపూర్ణంగా దాటించాలని ఆకాంక్షించారు. కరోనా మహమ్మారిని ప్రజలందరూ క్షేమంగా దాటాలని కోరుకున్నారు. ప్రజలందరికీ సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుణ్ని ప్రార్థించారు. కరోనా విజృంభిస్తోందని గుర్తుచేసిన ఆయన ప్రతిఒక్కరూ విధిగా మాస్క్‌ ధరించాలని సూచించారు. కొవిడ్‌ నిబంధనలు పాటించాలని హితవు పలికారు.

 కేసీఆర్ శుభాకాంక్షలు

కేసీఆర్ శుభాకాంక్షలు

ఉగాది సందర్భంగా తెలంగాణ సీఎం కె చంద్రశేఖర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్లవ నామ సంవత్సరంలో తెలంగాణ వ్యవసాయ రంగానికి సాగునీరు మరింత సమృద్ధిగా లభించనుందని, ప్రభుత్వ లక్ష్యానికి ప్రకృతి కూడా తోడు కావడం శుభసూచకమని అన్నారు. రైతుల పండగగా, వ్యవసాయానికి ప్రారంభంగా ఉగాది ప్రసిద్ధికెక్కిందని పేర్కొన్నారు. రైతులు వ్యవసాయానికి ముందస్తు ఏర్పాట్లను ఉగాది సందర్భంగానే ప్రారంభిస్తారని, రైతులను వ్యవసాయానికి సంసిద్ధం చేసే ఉగాది రైతు జీవితంలో భాగమైపోయిందని వివరించారు. తీపి, వగరు, చేదు రుచులతో కూడిన ఉగాది పచ్చడి సేవించి పండుగ జరుపుకోవడం గొప్ప సందేశాన్నిస్తుందని... మనిషి జీవితంలో కష్టసుఖాలు, మంచిచెడులకు అది ప్రతీకగా భావించవచ్చని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అన్నదాతల కుటుంబాల్లో వెలుగులు నింపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు.

 శుభాకాంక్షలు తెలిపిన పోచారం

శుభాకాంక్షలు తెలిపిన పోచారం

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ తెలంగాణ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస రెడ్డి ఉగాది శుభాకాంక్ష‌లు తెలిపారు. వికార నామ సంవ‌త్స‌రం.. పేరుకు త‌గ్గ‌ట్టు వికృతంగా నాట్యం చేసింది. శార్వ‌రి నామ సంవ‌త్స‌రం ప్ర‌పంచాన్ని అంధ‌కారంలోకి నెట్టింది. ఇప్పుడు వ‌చ్చింది ప్ల‌వ నామ సంవ‌త్స‌రం. ప్ల‌వ అంటే దాటించున‌ది అని అర్థం.. "దుర్భిక్షాయ ప్లవ ఇతి. తతశ్శోభనే భూరితోయం" దుర్భరమైన ప్రతికూలతను దాటించి భూమికి శోభను చేకూరుస్తుంది అని వరాహసంహిత వివరించింది. అంటే చీక‌టి నుంచి వెలుగులోకి న‌డిపిస్తుంద‌ని అర్థం' అని తెలిపారు. ప్ల‌వ నామ సంవ‌త్స‌రంలో ప్ర‌జ‌ల‌ క‌ష్టాలు తీరిపోయి, సుఖ‌సంతోషాల‌తో ఉండాల‌ని ఆకాంక్షించారు. క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న నేప‌థ్యంలో త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఆనందంగా పండుగ జ‌రుపుకోవాల‌ని సూచించారు.

English summary
telugu state cms plava name ugadi wishes to people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X