వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బురారీ సూసైడ్ కేసు: ఆ ఇంటిని దేవాలయంగా మార్చాలని విజ్ఞప్తి

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన ఢిల్లీ బురారీ కుటుంబం సామూహిక ఆత్మహత్యల కేసులో దర్యాప్తు చేసే కొద్దీ షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. వారు చనిపోవడానికి కొద్ది గంటల ముందు ఆ కుటుంబంలోని కొందరు వ్యక్తులు ఆత్మహత్యల కోసం స్టూల్, వైర్లు తీసుకుని వెళ్తున్నట్లుగా ఓ వీడియో వెలుగు చూసింది. ఆ తర్వాత, తాజాగా ఆత్మహత్యకు తానే ప్రేరేపించినట్లు గీతామా అనే మహిళ ముందుకు వచ్చింది.

ఇదిలా ఉండగా, 11 మంది ఆత్మహత్య చేసుకున్న ఇంటిని ఏం చేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. ఆ ఇంటిని ఆలయంగా మార్చాలని కొందరు స్థానికులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. కుటుంబంలోని 11 మంది ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికులు భయానికి లోనవుతున్నారు.

Temple? Burari wonders what to do with ‘house of death’

దీనికి తోడు ఆత్మహత్య వెనుక కారణాలు మీడియాలో ప్రసారమవడం, పోలీసులు రోజూ ఆ ఇంటి వద్దకు వచ్చి వెళ్తుండటంతో వారంతా ఆందోళనకు చెందుతున్నారు. ఇప్పటికే ఆ ఇంటి చుట్టుపక్కల నివసించే చాలామంది భయంతో తమ ఇళ్లను ఖాళీ చేస్తున్నారట.

ప్రస్తుతం నారాయణ్‌ దేవి ఇంటిని పోలీసులు సీజ్‌ చేశారు. దర్యాప్తు తర్వాత ఆ ఇంటిని ఎవరికి అప్పగిస్తారన్న దానిపై స్పష్టత రాలేదు. అయితే ఆ ఇంటిని ఆలయంగా మార్చితేనే మంచిదని కొందరు స్థానికులు భావిస్తున్నారు. ఆ ఇంటిని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.
మరోవైపు, మహిళా మంత్రసాని గీతామాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

English summary
The Burari house in which 11 members of a family were found dead on Sunday stares at an uncertain future with a a few locals suggesting that a temple should replace the building.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X