వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుళ్ళలో హీటర్లు, వేడినీళ్ళతో అభిషేకం, ఎందుకంటే?

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో:దేవుళ్ళకు కూడ చలి నుండి రక్షణ కల్పించేందుకు ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఓ గుడిలో ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దేవుళ్ళకు వేడి నీళ్ళనే ఉపయోగిస్తున్నారు. దేవాలయంలోని గర్భగుడిలో హీటర్లు కూడ పెట్టి చలి నుండి కాపాడుతున్నారు.

అసలే శీతాకాలం. సాధారణంగా దక్షిణాది ప్రాంతానికి చెందినవారే చలికి తట్టుకోలేకపోతున్నారు. అయితే అదే సమయంలో దేవుళ్ళకు కూడ చలి నుండి రక్షణ కల్పించాలని యూపీలోని పూజారులు వినూత్నంగా ఆలోచించారు.ఆలయ గర్భగుడిలో హీటర్లు ఏర్పాటు చేశారు. అంతేకాదు దేవుడికి వేడి నీళ్ళతోనే అభిషేకం చేస్తున్నారు.

Temple gets heater, hot water so idols don't catch cold

యూపీలోని జానకి ఘాట్ బడాస్థాన్ ఆలయంలోని గర్భగుడిలో హీటర్లు ఏర్పాటు చేసి దేవతా విగ్రహాలకు వేడి నీళ్లతో అభిషేకం చేయిస్తున్నారు.అయోధ్యలోని రమలల్లా విగ్రహానికి నూలు వస్త్రాలు తొడగాలని ఆలయంలో హీటర్లు పెట్టించాలని రెండు రోజుల క్రితం వీహెచ్‌పీ డిమాండ్ చేసింది. యాధృచ్చికమో, ఈ డిమాండ్ కారణమో కానీ బడాస్థాన్ ఆలయంలో హీటర్లు ఏర్పాటు చేయడం గమనార్హం.

English summary
If you think only humans find it difficult to endure cold wave in chilly weather, then you are wrong. Even gods feel the need to get warm, if reports from a Ayodhya based temple are to be believed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X