వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్, 10 మంది మృతి: నక్సలైట్లకు ఎదురుదెబ్బ

|
Google Oneindia TeluguNews

నయారాయపూర్: ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఎదురు కాల్పుల్లో పదిమంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని చెబుతున్నారు. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్ చోటు చేసుకున్న ప్రాంతం ఇంద్రావతి నది సమీపంలో ఉంటుంది.

ఎన్‌కౌంటర్‌లో పది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు భద్రతా దళాలు ధృవీకరించాయి. మాడ్ అటవీ ప్రాంతంలో జవాన్లు కూంబింగ్‌కు వెళ్లారు. ఈ సమయంలో మావోయిస్టులు తారసపడ్డారు. లొంగిపోవాలని జవాన్లు హెచ్చరించినా వారు వినకుండా కాల్పులకు తెగబడ్డారు.

ten naxal died in encounter with police in Bijapur District

దీంతో జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పదిమంది నక్సలైట్లు చనిపోయారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్ అనంతరం ఆ ప్రదేశానికి అదనపు బలగాలను తరలించారు. అడవిని జల్లెడ పడుతున్నారు.

ఇటీవలి కాలంలో నక్సలైట్లకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తమకు తగులుతున్న ఎదురుదెబ్బల అనంతరం.. ఇటీవల ఏపీలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావుతో పాటు మాజీ ఎమ్మెల్యేను నక్సలైట్లు చంపేశారు. పలు సందర్భాల్లో పోలీసులకు సవాల్ చేశారు. తాము పుంజుకుంటామని చెప్పారు. కానీ ఇప్పుడు మళ్లీ పదిమంది నక్సలైట్లు చనిపోవడం పెద్ద ఎదురుదెబ్బ.

English summary
Ten naxal died in encounter with police in Bijapur District. Big shock to naxalites in Chhattisgarh state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X